మలయాళ సినీ పరిశ్రమలో(Malyalam Film Industry) ప్రకంపనాలు మొదలయ్యాయి.

మలయాళ సినీ పరిశ్రమలో(Malyalam Film Industry) ప్రకంపనాలు మొదలయ్యాయి. జస్టిస్‌ హేమ కమిటీ(Justice Hema Committie) నివేదిక తర్వాత ఇండస్ట్రీలోని మహిళలు స్వేచ్ఛగా తమ స్వరాన్ని వినిపిస్తున్నారు. నటి రేవతి సంపత్‌(Revathi sampath) గతంలో జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టారు. సీనియర్‌ నటుడు సిద్దిఖీ(Siddique) తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బాంబు పేల్చారు. ఆమె చేసిన వ్యాఖ్యలు మలయాళ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపింది. దీంతో

మ‌ల‌యాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(AMMA) స‌భ్యులంద‌రూ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. ఆరోపణలకే పరిమితం కాకుండా రేవతి సంతప్‌ పోలీసులకు సిద్దిఖీపై కంప్లయింట్‌ కూడా చేశారు. రేవతి సంపత్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన తిరువనంతపురం పోలీసులు సిద్ధిఖీపై రేప్‌ కేసు నమోదు చేశారు. నాన్‌ బెయిలబుల్ నేరాల కింద కేసులు నమోదు చేయడం గమనార్హం. ఒక సినిమా గురించి సిద్ధిఖీ వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు తనపై అత్య‌చారం చేశాడని, త‌న‌తో పాటు త‌న స్నేహితుల‌ను కూడా లైంగికంగా సిద్ధిఖీ వేధించాడని రేవ‌తి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story