టాలీవుడ్ నటుడు మాస్టర్ భరత్ (Master Bharat)ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

టాలీవుడ్ నటుడు మాస్టర్ భరత్ (Master Bharat)ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. భరత్ తల్లి మాతృమూర్తి కమలాసిని (Kamalasini)మృతి చెందారు. మే 18 ఆదివారం రాత్రి చెన్నై(Chennai)లో కమలాసిని కన్ను మూశారు. దీంతో భరత్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఈ విషాదం గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు భరత్‌కు ఫోన్ చేసి ఓదారుస్తున్నారు. భరత్ తల్లి మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న కమలాసిని ఆదివారం రాత్రి గుండెపోటు(Heart Strock)తో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న భరత్ కుటుంబ సభ్యులతో పాటూ పలువురు ప్రముఖులు చెన్నైలోని భరత్ ఇంటికెళ్లి ఆమె భౌతిక కాయాన్ని సందర్శిస్తున్నారు. భరత్ తల్లి మరణం పట్ల సెలబ్రిటీలు, కో యాక్టర్లు భరత్ కు సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియచేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. బాల్య నటుడిగా భరత్ సుమారు 80కి పైగా సినిమాల్లో నటించాడు. పోకిరి(Pokiri), రెడీ(Ready), వెంకీ(Venky), ఢీ(Dhee), కింగ్(King), మిస్టర్ పర్ఫెక్ట్(Mister perfect), లాంటి పలు సూపర్‌హిట్ సినిమాల్లో నటించి తనదైన కామెడీతో తెలుగు ఆడియన్స్‌ను అలరించి మెప్పించాడు. మధ్యలో స్టడీస్ కారణంతో ఇండస్ట్రీకి దూరమైన భరత్ చిన్నప్పుడు చాలా బొద్దుగా కనిపించాడు. కానీ తర్వాత రీఎంట్రీ టైమ్ లో మాత్రం సన్నగా స్లిమ్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. భరత్ చివరిగా గోపీచంద్ నటించిన విశ్వం సినిమాలో నటించాడు.

ehatv

ehatv

Next Story