✕
Shakuntalam Premier Show Review : శాకుంతలం ప్రీమియర్ టాక్ సూపర్
By EhatvPublished on 12 April 2023 5:52 AM GMT
ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న గుణశేఖర్ దృశ్యకావ్యం శాకుంతలం ఈ మధ్యనే ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. ఈ షోలకు నార్మల పబ్లిక్నే ఆహ్వానించారు. చిత్ర యూనిట్‌కి సంబంధించిన వారిని గాని, ఇతరత్రా ఈ చిత్రనిర్మాణ, వ్యాపార వ్యవహార లావాదేవీలతో గానీ ఎటువంటి ప్రమేయం ఉన్నవారిని కాకుండా, సాధారణ ప్రేక్షకులకే మాత్రమే ప్రదర్శించారు. చూసినవారంతా శాకుంతలం చిత్రం ఓ అద్భుతమైన అనుభవంగా, అపూర్వమైన అనుభూతిగా అభివర్ణించి,

x
Shakuntalam Premier Show Review
-
- ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న గుణశేఖర్ దృశ్యకావ్యం శాకుంతలం ఈ మధ్యనే ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. ఈ షోలకు నార్మల పబ్లిక్నే ఆహ్వానించారు. చిత్ర యూనిట్‌కి సంబంధించిన వారిని గాని, ఇతరత్రా ఈ చిత్రనిర్మాణ, వ్యాపార వ్యవహార లావాదేవీలతో గానీ ఎటువంటి ప్రమేయం ఉన్నవారిని కాకుండా, సాధారణ ప్రేక్షకులకే మాత్రమే ప్రదర్శించారు. చూసినవారంతా శాకుంతలం చిత్రం ఓ అద్భుతమైన అనుభవంగా, అపూర్వమైన అనుభూతిగా అభివర్ణించి, తర్శకనిర్మాత గుణశేఖర్‌ని పొగడ్తలలో ముంచెత్తారు.
-
- ముఖ్యంగా చిత్రంలో ప్రధానంగా టైటిల్ రోల్‌ని పోషించిన ప్రుమఖ కధానాయకి సమంత యాక్టింగ్ టాలెంట్‌ను పదేపదే మెచ్చుకున్నారు. ప్రత్యేకించి, శాకుంతలం చిత్రంలోని టెక్నికల్ జాబ్‌ని అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఒక్కొక్క సీను ఒక్కొక్క సినిమాలా, కన్నుల పండుగలా ఉందనీ, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో అత్యద్బుతంగా ఉండడంతో శాకుంతలం అన్ని భాషాప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందనే గట్టి నమ్మకాన్ని అందరూ వ్యక్తం చేయడంతో శాకుంతలం చిత్రం అనూహ్యమైన చరిత్రను నెలకొల్పుతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు.
-
- మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యంగా ఎంతగా అందరినీ ఆశ్చర్య చకితం చేసి యుగయుగాలుగా చిరస్థాయిగా నిలిచిపోయిందో, అదే విధంగా గుణశేఖర్ దర్శకనిర్మాతగా రూపొందించిన శాకుంతలం చిత్రం కూడా భారతీయ చిత్రపరిశ్రమలోనే కాదు, ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే శాశ్వతమైన కీర్తిప్రతిష్టలను సొంతం చేసుకుంటుందని కూడా అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా గుణశేఖర్ చెప్పినట్టుగా, శాకుంతలం చాలా రిచ్‌గా రూపొందడానికి అన్నివిధాలా సహనిర్మాతగా నిలబడిన సుప్రసిద్ధ నిర్మాత దిల్‌రాజు కంట్రిబ్యూషన్ చాలా అమూల్యమైనదని చూసినవారి టాక్.
-
- దానాదీనా, శాకుంతలం చిత్రానికి ప్రీమియర్ షోలలో గొప్ప టాక్ లభించింది. ఈ మాటే గనక రేపు విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా లభించడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయని, శాకుంతలం చిత్రం స్థాయిప్రమాణాలు ఆ రేంజ్లో ఉన్నాయన్నది ట్రేడ్ టాక్ కూడా. అన్నిటినీ మించి, ఇంత గొప్పగా తెరకెక్కిన శాకుంతలం చిత్రానికి త్రిడి యానిమేషన్ టెక్నికల్‌గా గొప్ప వేల్యూని ఆపాదించిందన్నది మరో ప్రత్యేకమైన కామెంట్. ” Written By : Nagendra Kumar “

Ehatv
Next Story