మలయాళ హీరో కమ్ విలన్ ఉన్ని ముకుందన్(Unni Mukundan) మన తెలుగువారికి కూడా పరిచయమే! జనతా గ్యారేజ్(Janatha Garage), భాగమతి(Bhagathi), యశోద ఇత్యాది సినిమాలలో నటించారు. మన తెలుగులో నెగటివ్ రోల్సే చేశాడు కానీ మలయాళంలో కథానాయకుడి వేషాలు కూడా వేశాడు. ఆ మధ్యన శబరిమల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించిన మాలికాపురం(Malikapuram) సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. తెలుగులోకి కూడా డబ్ చేశారీ సినిమాను.

Unni Mukundan
మలయాళ హీరో కమ్ విలన్ ఉన్ని ముకుందన్(Unni Mukundan) మన తెలుగువారికి కూడా పరిచయమే! జనతా గ్యారేజ్(Janatha Garage), భాగమతి(Bhagathi), యశోద ఇత్యాది సినిమాలలో నటించారు. మన తెలుగులో నెగటివ్ రోల్సే చేశాడు కానీ మలయాళంలో కథానాయకుడి వేషాలు కూడా వేశాడు. ఆ మధ్యన శబరిమల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించిన మాలికాపురం(Malikapuram) సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. తెలుగులోకి కూడా డబ్ చేశారీ సినిమాను. ఉన్ని ముకుందన్ హీరోయిన్ అనుశ్రీతో(Anu shri) డేటింగ్‌లో ఉన్నాడని, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా తెగ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ కథనాలపై ఉన్ని ముకుందన్ రియాక్టయ్యాడు. తన సినిమా జై గణేశ్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు ఉన్ని ముకుందన్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన విడుదలవుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే అది ఉన్ని ముకుందనే! అందుకే ఆయనపై తెగ వదంతులు వస్తుంటాయి. తన సహ నటీమణులతో డేటింగ్‌లో ఉన్నాడంటూ ఆయనపై రూమర్లు వ్యాపిస్తుంటాయి. ఆ లిస్టులో కొత్తగా నటి అనుశ్రీ వచ్చారిప్పుడు! తాను అనుశ్రీతో ఒక సినిమా మాత్రమే చేయబోతున్నానని, ఇండస్ట్రీలో తన పేరు తరచుగా ఇతర హీరోయిన్‌లతో ముడిపెడుతున్నారని ఉన్ని ముకుందన్ చెప్పుకొచ్చాడు. గతంలో కూడా చాలా మంది హీరోయిన్లతో తనకు లింక్ పెట్టారని, ఇప్పుడు వారంతా పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నారని తెలిపారు. ఈ లెక్కన అనుశ్రీకి కూడా త్వరలో పెళ్లయ్యే అవకాశాలున్నాయని నవ్వుతూ చెప్పాడు ఉన్ని ముకుందన్. తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని, ఈ వదంతులు ఎలా వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని చెప్పాడు. ఈ రూమర్స్ తనకు కొత్త కాకపోయినా, పాపం అనుశ్రీకి మాత్రం కొత్త కాబట్టి కొంచెం ఒత్తిడికి గురికావచ్చని ఉన్ని ముకుందన్ చెప్పాడు.
