రాంచరణ్‌-ఉపాసన దంపతులకు పెళ్లయి 13 ఏళ్ల తర్వాత ముద్దుల కూతురు క్లింకారా పుట్టింది.

రాంచరణ్‌-ఉపాసన దంపతులకు పెళ్లయి 13 ఏళ్ల తర్వాత ముద్దుల కూతురు క్లింకారా పుట్టింది. కానీ క్లింకారా పుట్టి ఏడాది దాటిన తర్వాత కూడా ఆ చిన్నారి మొహం బయటపెట్టడం లేదు. క్లింకారా ముఖాన్ని బయటపెట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. అయితే దీనికి ఓ కారణం ఉందని, కావాలనే ఇలా ఫేస్ కవర్ చేస్తున్నామని ఉపాసన చెప్పుకొచ్చింది. తాజాగా ఢిల్లీలో దసరా వేడుకల్లో పాల్గొన్న ఈమె.. కూతురు క్లీంకార గురించి మాట్లాడింది. అలానే తనని ట్యాగ్స్ పెట్టి పిలవడంపైనా స్పందించింది. 'ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది దానికి తోడు కొన్ని సంఘటనలు తల్లిదండ్రులుగా మమ్మల్ని భయపెట్టాయి. మా పాపకు స్వేచ్ఛ ఇవ్వాలని అనుకుంటున్నాం. అందుకే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేటప్పుడు పాప ముఖానికి మాస్క్ వేస్తుంటాం. చెప్పాలంటే ఇది పాపకు తల్లిదండ్రులుగా నాకు, చరణ్‌కి పెద్ద పని. అయితే మేం కరెక్ట్ పని చేస్తున్నామా లేదా అనేది మాకు తెలీదు. కానీ పాప ముఖాన్ని దాస్తున్న విషయంలో రామ్, నేను సంతోషంగానే ఉన్నాం.' అని ఉపాసన చెప్పుకొచ్చింది.

Updated On
ehatv

ehatv

Next Story