అతిలోక సుందరి శ్రీదేవి(Sri devi) కూతురు జాన్వీ కపూర్(Janhvi kapoor) తొలిసారిగా తెలుగులో నటిస్తున్న సినిమా దేవర(Devara)!
అతిలోక సుందరి శ్రీదేవి(Sri devi) కూతురు జాన్వీ కపూర్(Janhvi kapoor) తొలిసారిగా తెలుగులో నటిస్తున్న సినిమా దేవర(Devara)! దేవర సినిమాకు ఈమె స్పెషల్ అట్రాక్షన్. పాటలలో ఆమె కనబర్చిన ఈజీనెస్‌ను చూసి చాలా మంది మెస్మరైజ్ అయ్యారు.
సినిమాలో ఎలా కనిపించబోతుందా అన్ని ఎగ్జైట్‌మెంట్ పెరిగింది అందరిలో! దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre release event) కూడా ఆమె కూడా అందంగా ముస్తాబయ్యింది. కానీ ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ కావడంతో ఈవెంట్‌ను రద్దు చేశారు.
సినిమాలో ఎలా కనిపించబోతుందా అన్ని ఎగ్జైట్‌మెంట్ పెరిగింది అందరిలో! దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre release event) కూడా ఆమె కూడా అందంగా ముస్తాబయ్యింది. కానీ ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ కావడంతో ఈవెంట్‌ను రద్దు చేశారు.
ఎన్టీఆర్(Jr NTR) అభిమానులకు ఇది ఊహించని షాకే! అందుకే అభిమానులకు ఊరట కలిగించడానికి జాన్వీ కపూర్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.
స్టేజీపై మాట్లాడటం కోసం ప్రిపేర్ అయిందంతా ఇప్పుడు వీడియోలో చెప్పేసింది.
'అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి నా మీద ఇంత ప్రేమని చూపించిన తెలుగు ఆడియెన్స్ అలానే నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సర్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు.
మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీలవడం నాకెంతో ఆనందంగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో తెలుసు.
అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. అలానే నాకు కూడా! నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. శివ సర్, ఎన్టీఆర్ సర్ ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకోవడం నా అదృష్టం.
మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. నాకు చాలా సహాయపడిన చిత్రబృందానికి థ్యాంక్స్' అని వీడియోలో అచ్చమైన తెలుగులో జాన్వీ కపూర్ మాట్లాడింది.
'నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబుదామనుకున్నాను. కానీ ఈ సారికి అలా కుదరలేదు. మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్నా.
ప్రస్తుతానికి ఇది నా నుంచి మీకు ఈ చిన్న మెసేజ్' అని జాన్వీ వీడియోతో పాటు రాసుకొచ్చింది.