ఈరోజు రిలీజ్ అయిన కన్నప్ప సినిమాకు బయలుదేరి.. మార్గమధ్యంలో అనుకోకుండా విజయ్ ఆంటోని మార్గాన్ మూవీ చూడటం జరిగింది.

ఈరోజు రిలీజ్ అయిన కన్నప్ప సినిమాకు బయలుదేరి.. మార్గమధ్యంలో అనుకోకుండా విజయ్ ఆంటోని మార్గాన్ మూవీ చూడటం జరిగింది. ఈ సినిమా రివ్యూ విషయానికొస్తే

సంగీత దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించి నటుడిగా ఎదిగారు విజయ్‌ ఆంటోని. బిచ్చగాడుతో టాలీవుడ్‌(Tollywood)లో మంచి క్రేజ్‌, మార్కెట్‌ సంపాదించుకున్నారు. వైవిధ్యమైన కథలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన కొత్త ప్రయోగాలు చేయడానికి వెనకాడరు.విజయ్‌ ఆంటోని తాజాగా నటించి, నిర్మించిన చిత్రం మార్గాన్‌. ఇప్పటివరకు ఫిలిం ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించిన లియో జాన్‌ పాల్‌ (Janpal) తొలిసారి దర్శకత్వం వహించారు.విజయ్ ఆంటోనీ పాత్రకు ధీటుగా డిజైన్ చేసిన క్యారెక్టర్‌లో విజయ్ ఆంటోనీ (Vijay Antony)మేనల్లుడు అజయ్ దిషాన్ అనే కుర్రాడు నటించాడు. తన యాక్టింగ్, క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్.. ఈ ఎపిసోడ్‌లో వచ్చే సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌ క్యారీ చేస్తూనే మిస్టరీని కొనసాగిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ స్క్రీన్ ప్లే వేగంగా సాగుతూ ఎక్కడా బోర్ కొట్టనివ్వదు..స్వతహాగా ఎడిటర్ కావడంతో ఎడిటింగ్ విషయంలో చాలా కేర్తీసుకున్నాడు.

దర్శకుడు జాన్ పాల్.

సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ డీసెంట్ గా ఉన్నాయి. అయితే థ్రిల్లర్స్ కి ట్విస్ట్ రివీల్ చేయడం అనేది చాలా క్రూషియల్. ఆ విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. రెండు గంటలపాటు బిల్డ్ చేసిన సినిమాకి అయిదే ఐదు నిమిషాల్లో కంగారుగా ముగించేయడం అనేది సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది.ఇలాంటి జానర్ చిత్రాలకు సాధారణంగా ఒక ఫార్ములా ఉంటుంది. మనం ఎవరిపై అనుమానం పడతామో, వారు అసలు హంతకులు కారు. మనం తేలికగా తీసుకునే పాత్రలే చివరికి షాకింగ్ ట్విస్ట్ ఇస్తాయి."మార్గన్" కూడా అదే ఫార్మాట్‌ను అనుసరించి ఒక అనూహ్యమైన మలుపును అందిస్తుంది. హంతకులు ఎవరో ప్రేక్షకులు దాదాపుగా ఊహించలేరు. ఫస్టాఫ్ అంతా అరవింద్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇక సెకండాఫ్లో అరవింద్ పాత్ర చేసే విన్యాసాలు, దర్యాప్తులో అందించే సహాయం ఆకట్టుకుంటాయి. ప్రీ-క్లైమాక్స్‌కు చేరుకునే కొద్దీ అసలైన ట్విస్టులు ఒక్కొక్కటిగా బయటపడతాయి. కేవలం రెండు గంటల నిడివిలో ఎంగేజింగ్‌గా కథనాన్ని నడిపించడంలో దర్శకుడు లియో జాన్ పాల్ విజయం సాధించాడని చెప్పొచ్చు.ఇక నటీనటుల విషయానికొస్తే..

విజయ్ ఆంటోనికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే అని చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. అజయ్ ధీషన్ తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. కొత్త వాడైనా కూడా తన యాక్టింగ్ తో మెప్పించాడు. మిగిలిన నటీనటులు బ్రిగెడ సాగ, దీప్సిఖ ,సముద్రఖని తమ పరిధి మేరకు మెప్పించారు.సాంకేతిక నిపుణుల విషయానికొస్తే విజయ్ ఆంటోనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. యువ ఛాయాగ్రహం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్టుగానే ఉన్నాయి. చివరగా ఓటీటీలలో క్రైమ్ థ్రిల్లర్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఈ చిత్రం గొప్పగా అనిపించకపోవచ్చు కానీ నిరాశ పరచదు.

ehatv

ehatv

Next Story