టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay devarkonda), నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న(Rashmika mandanna) మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందనే వార్త చాన్నాళ్లుగా వినిపిస్తోంది.

టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay devarkonda), నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న(Rashmika mandanna) మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందనే వార్త చాన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ విషయం అడిగితే ఇద్దరూ దాటవేస్తారే తప్ప విషయం చెప్పరు. కాకపోతే పలు సందర్భాలలో ఇద్దరూ నెటిజన్లకు దొరికిపోయారు. గీత గోవిందం(Geetha govindham) సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన వీరిద్దరు తర్వాత డియర్‌ కామ్రేడ్‌లో(Dear comrade) నటించారు. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా వర్క్‌ అవుటయ్యిందన్నది పలువురి అభిప్రాయం. విజయ్‌ దేవరకొండ, రష్మిక మంచి ఫ్రెండ్స్‌. రెండు కుటుంబాల మధ్య కూడా స్నేహ సంబంధాలు ఉన్నాయి. తాము మంచి స్నేహితులమే తప్ప తమ మధ్య ప్రేమ దోమలాంటివి లేవని చాలా మార్లు చెప్పారు. అయినా చాలా మందిలో ఇద్దరి మధ్య ఏదో ఉందనే సందేహం మాత్రం అలాగే ఉంది. ఇటీవల సాహిబా(Sahiba) అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌లో విజయ్‌ దేవరకొండ నటించాడు. ఈ ఆల్బమ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు 35 ఏళ్లు వచ్చాయని, ఇంకా తనను సింగిల్‌ అని ఎలా అనుకుంటారని అన్నాడు. అంటే దానర్థం ఏమిటి? రష్మికతో డేటింగ్‌లో ఉన్నట్టే కదా అని లాజిక్కులు తీస్తున్నారు నెటిజన్లు. లాజిక్కు కాదు నిజమేనని చెప్పడానికి తాజాగా విజయ్‌, రష్మిక కలిసి ఓ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్(Breakfast) చేస్తూ కనిపించారు. ర‌ష్మిక త‌న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా… వీరిద్ద‌రి క‌లిసి తింటున్న ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ప్రస్తుతం వీరిద్దరు వెకేషన్‌లో ఉన్నట్టు ఫోటోలను బట్టి అర్థమవుతోంది.

విజయ్‌-రష్మిక సీక్రెట్‌ డేటింగ్‌.. ఫోటోలు చెబుతున్న సాక్ష్యం!

Updated On
Eha Tv

Eha Tv

Next Story