Vijay Fans: ఆ మ్యూజిక్ డైరెక్టర్ ను టార్చర్ పెట్టిన విజయ్ ఫ్యాన్స్
ఇంత గొడవ ఎందుకు అనుకున్నాడో లేక.. విజయ్ అభిమానుల టార్చర్ వద్దనుకున్నాడో
- Written By: Yagnik Published Date - Fri - 19 April 24
తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా.. తళపతి విజయ్ కొత్త చిత్రం.. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ కోసం స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం మొదటి లిరికల్ సాంగ్ ‘విజిల్ పోడు’ ఇటీవల విడుదలైంది. పాట ట్యూన్, కంపోజిషన్ పట్ల అభిమానులు పూర్తిగా నిరాశ చెందారు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. బూతులు తిడుతూ అతనిని లక్ష్యంగా చేసుకున్నారు.
యువన్ శంకర్ రాజా అభిమానులు కూడా విజయ్ ఫ్యాన్స్ పై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇంత గొడవ ఎందుకు అనుకున్నాడో లేక.. విజయ్ అభిమానుల టార్చర్ వద్దనుకున్నాడో కానీ యువన్ శంకర్ రాజా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేశాడు. ఈ ఘటనపై ఆయన ఏమీ స్పందించలేదు కానీ మౌనంగానే ఉన్నారు. విజయ్ భారీ హిట్స్ రేంజిలో పాటను ఆశించగా.. విజిల్ పోడు పాట రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాకుండా వారికి కోపం కూడా తెప్పించింది. అందరు సంగీత దర్శకులు ఒకేలా ఉండరని, ఒక్కొక్కరికీ ఒక్కో స్పెషాలిటీ ఉంటుందని అభిమానులు అర్థం చేసుకోవాలి. వారిని వేధిస్తే.. తాము ఏ హీరోకు ఫ్యాన్ అని చెబుతూ ఉంటామో ఆయనకు కూడా చెడ్డ పేరే. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 5న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేయనుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తోంది.
-
Chandrababu Shocking Comments on Caste Census : కులగణనపై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
-
Sonia Gandhi Family: రెండు దశాబ్దాల తర్వాత అమేథి బరిలో గాంధీయేతరులు
-
Karnataka Sex Scandal: ప్రజ్వల్‌ను శ్రీకృష్ణడితో పోల్చిన మంత్రి… భగ్గమంటున్న బీజేపీ
-
Kerala Bus in London : లండన్‌లో కేరళ బస్సు..!
-
Hara Hara veera Mallu: హరిహర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకున్నాడు. జ్యోతికృష్ణ వచ్చాడు!
-
West Bengal : బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
-
Actress Syamala : గీతను ఓడించడం ఎవరి తరం కాదు.. పవన్‌పై నటి శ్యామల కామెంట్స్