నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయ్యాయి.

నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉన్నారాయన! పైగా టాక్‌ షో(Talk show) కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన వారసుడిగా కొడుకు మోక్షజ్ఞ(Mokshagna) సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చిరంజీవి(Chiranjeevi) కొడుకు రామ్‌చరణ్‌(Ram charan) వచ్చేశాడు.. నాగార్జున కొడుకులిద్దరూ వచ్చేశారు. బాలయ్య కొడుకు ఎప్పుడు వస్తాడు అని నందమూరి ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఆ మాటకొస్తే నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడో రావాల్సి ఉంది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇంతకాలానికి ముహూర్తం ఫిక్సయ్యింది. హనుమాన్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మకు(Prashanth varma) తన కొడుకును వెండితెరకు పరిచయం చేసే అవకాశం ఇచ్చారు బాలకృష్ణ. మొన్నామధ్య మోక్షజ్ఞ పుట్టిన రోజున ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట! డిసెంబర్‌ మూడో వారం నుంచి ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళుతుంది. స్క్రిప్ట్‌ను ఒకటికి రెండు సార్లు బాలయ్య చదివారని, ఆయనకు బాగా నచ్చిందని మేకర్స్‌ అంటున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా సెట్లు వేశారట! మోక్షజ్ఞ సరసన అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ క‌పూర్ నటిస్తుందని అంటున్నారు దీనిపై అధికార ప్రకటన ఇంకా రాలేదు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story