వరుస ఫ్లాపులు రవితేజ(Ravi Teja) కెరీర్‌పై పెను ప్రభావం చూపుతున్నాయి. సినిమాల ఎంపికలో రవితేజ తప్పటడుగులు వేస్తున్నాడు.

వరుస ఫ్లాపులు రవితేజ(Ravi Teja) కెరీర్‌పై పెను ప్రభావం చూపుతున్నాయి. సినిమాల ఎంపికలో రవితేజ తప్పటడుగులు వేస్తున్నాడు. వయసుకు తగిన పాత్రలను ఎంపిక చేసుకోకుండా అదే రొట్టకొట్టుడు మూస పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు తలనొప్పులు తెస్తున్నాడు. ఫ్యాన్స్‌కు తలవంపులు తెస్తున్నాడు. ఇంతకు ముందు రవితేజతో సినిమాలు తీసినవారంతా ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. పీపుల్స్ మీడియా(Peoples Media), మైత్రీ మూవీస్(Mythri movies),సుధాకర్ చెరుకూరి(Sudhakar Chekuri),కోనేరు సత్యనారాయణ(Koneru Sathyanarayana),అభిషేక్ నామా(Abhishek Nama),అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal),రామ్ తాళ్లూరి(Ram Thulluri),కెకె రాధామోహన్(KK Radha Mohan) వీరంతా రవితేజతో సినిమాలు చేసినవారే.. చేతులు కాల్చుకున్నవారే! పీపుల్స్‌ మీడియా సంస్థ ఓ సినిమాతో బాగానే సంపాదించింది. కానీ మరో సినిమాతో సర్వ మంగళం పాడుకుంది. మైత్రీ మూవీస్‌ రవితేజతో ఓ సినిమా తీసి బాగా నష్టపోయింది. రామ్‌ తాళ్లూరి అయితే రెండు సినిమాలు తీసి రెండింటిలోనూ నష్టాలు చవిచూశారు. మిగిలిన వారు ఒక్కో సినిమా రవితేజతో తీసి ఉన్నది ఊడగొట్టుకున్నారు. ఇన్నేసి ఫ్లాపులు ఇస్తున్నా రవితేజ పారితోషికంగా పాతిక కోట్లు ఉండటమే ఆశ్చర్యం. ఇది నిజమో కాదో తెలియదు కానీ అంటున్నారు. ఇప్పుడు రవితేజకు కొత్త నిర్మాతలే గతి. పాత నిర్మాతలెవరూ ఆయన దరిదాపుల్లోకి రావడం లేదు. ఇప్పుడు సితార సంస్థలో రవితేజ నటిస్తున్నాడు. ఆ సంస్థలో రవితేజకు ఇది మొదటి సినిమా. ఒక్క దిల్‌రాజు(Dilraj),అశ్వనీదత్‌ తప్ప అందరూ రవితేజతో సినిమాలు తీశారు. నష్టపోయినవారు మళ్లీ రవితేజతో సినిమా తీయడానికి సాహసించడం లేదు. రవితేజ సినిమాలు థియేటర్లలో ఆడటం లేదు. ఓటీటీలో మార్కెట్ ఉందా అంటే అదీ లేదు. ఇప్పుడు అర్జెంట్‌గా రవితేజకు ఓ బ్రహ్మండమైన హిట్‌ కావాలి. ఆ హిట్‌ను అందించే దర్శకుడు ఎవరన్నదే ప్రశ్న!

Updated On
ehatv

ehatv

Next Story