ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో(AP assembly Elections) మెగాస్టార్‌ చిరంజీవి(chiranjeevi) ఎటువైపో తెలిసిపోయింది. తన తమ్ముడు పవన్‌కల్యాణ్‌కు(Pawan kalyan) అయిదు కోట్ల రూపాయలిచ్చినప్పుడే చిరంజీవి మద్దతు ఎవరికి ఉంటుందో అర్థమయ్యింది. కాంగ్రెస్‌(congress) పార్టీలో ఉంటూ జనసేనకు(Janasena) మద్దతు ఇవ్వడమేమిటని జనం అడక్కూడదు. మెగా ఫ్యామిలీలో అందరూ కాకున్నా కొందరు మాత్రం తెలుగుదేశం-జనసేన పార్టీల కోస నడుం బిగించడానికి సిద్ధమవుతున్నారు. ప్రచారం చేయడానికి ఉత్సాహపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో(AP assembly Elections) మెగాస్టార్‌ చిరంజీవి(chiranjeevi) ఎటువైపో తెలిసిపోయింది. తన తమ్ముడు పవన్‌కల్యాణ్‌కు(Pawan kalyan) అయిదు కోట్ల రూపాయలిచ్చినప్పుడే చిరంజీవి మద్దతు ఎవరికి ఉంటుందో అర్థమయ్యింది. కాంగ్రెస్‌(congress) పార్టీలో ఉంటూ జనసేనకు(Janasena) మద్దతు ఇవ్వడమేమిటని జనం అడక్కూడదు. మెగా ఫ్యామిలీలో అందరూ కాకున్నా కొందరు మాత్రం తెలుగుదేశం-జనసేన పార్టీల కోస నడుం బిగించడానికి సిద్ధమవుతున్నారు. ప్రచారం చేయడానికి ఉత్సాహపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో(Narendra Modi) కలిసి చిరంజీవి ప్రచార సభలో పాల్గొంటారని అంటున్నారు. ఇది ఇంకా నిర్ధారణ కాలేదు. నాగబాబు కొడుకు వరుణ్‌ తేజ్‌(Varun tej) కూడా బాబాయ్‌ గెలుపు కోసం పిఠాపురంలో ప్రచారం(Election Campaign) చేయబోతున్నారు.

నటుడు నిఖిల్(Nikhil) కూడా తనవారి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాడు. వీరందరూ సరే! మరి ఎన్టీఆర్‌(Jr NTR) మాటేమిటి? ఇంతకీ ఎన్టీఆర్‌ ఎవరివాడు? మావాడని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్(YCP) అంటుంటే, అబ్బే అతడు మావాడేనని టీడీపీ(TDP) చెబుతోంది. నిజానికి 2009 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఎన్నిక జరిగినా ఎన్టీఆర్‌ పేరు రాజకీయ తెరమీదకు వస్తూ ఉన్నది. ఆ మాటకొస్తే రాజకీయ సందడి లేని రోజుల్లో కూడా ఎన్టీఆర్‌ పేరును జపిస్తూ ఉంటారు. గుడివాడ, పెనమలూరులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన నామినేషన్‌ ర్యాలీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు కనిపించాయి. వైసీపీ కార్యకర్తల నోటి నుంచి జై ఎన్టీఆర్‌ అన్న నినాదాలు కూడా వినిపించాయి. అదే సమయంలో తెలుగుదేశంపార్టీ నిర్వహించిన సభలు, ర్యాలీలలో మాత్రం ఎన్టీఆర్‌ ఫోటోలు కనిపించలేదు. ఎన్టీఆర్‌ పేరు వినిపించలేదు. కొడాలి నానితో(Kodali nani) ఎన్టీఆర్‌కు మంచి అనుబంధం ఉంది. కొడాలి నాని తెలుగుదేశంపార్టీలో ఉన్నంత వరకు దోస్తానా బలంగా ఉండింది. అయితే నాని వైసీపీలో చేరిన తర్వాత ఎన్టీఆర్‌ డైలామాలో పడ్డారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపంలా అయ్యింది ఎన్టీఆర్‌ పరిస్థితి. కొడాలి నానితో తనకు రాజకీయపరమైన సంబంధాలేమీ లేవని, తాత ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీలోనే తాను ఉంటానని ఎన్టీఆర్‌ స్టేట్‌మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. బయటకు అలా చెప్పారే కానీ, ఎన్టీఆర్‌కు టీడీపీలో ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్‌ను టీడీపీ ఎంతగా అవమానించాలో అంతగా అవమానించింది. సీనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబ వేడుకలకు జూనియర్‌ను పిలవనే పిలవరు. ఆ మధ్యలో ఓ వేదికపై బాలకృష్ణ, ఎన్టీఆర్‌లిద్దరూ ఉన్నా తారక్‌ను చూసి చూడనట్టుగా వెళ్లిపోయారు బాలకృష్ణ. కనీసం పలకరించలేదు. తనను ఎన్ని అవమానాలకు గురి చేసినా మౌనంగా వాటిని భరించాడే తప్ప టీడీపీని ఎప్పుడు ఏమీ అనలేదు. చంద్రబాబు భార్య భునేశ్వరిపై వల్లభనేని వంశీ వివాదాస్పద వాఖ్యలు చేసినప్పుడు కూడా ఎన్టీఆర్‌ పైపైన ప్రకటన చేశాడే తప్ప నందమూరి ఫ్యామిలీ మెంబర్‌గా పెద్దగా స్పందించలేదు. ఎన్టీఆర్‌ సోదరుడు కల్యాణ్‌రామ్‌ కూడా అంతే! ఎన్టీఆర్‌లాగే మౌనంగా ఉంటున్నాడు. ప్రస్తుతానికి తాము రాజకీయాలకు దూరంగా ఉన్నామని కల్యాణ్‌రామ్ ప్రకటించాడు కూడా! ఎన్నికల సమయానికి తాము ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఫ్యామిలీతో కలసి కూర్చొని చర్చించుకుంటామని కల్యాణ్‌రామ్‌ చెప్పాడే తప్ప, తెలుగుదేశంపార్టీకే తమ మద్దతు అని చెప్పలేకపోయాడు. అంటే ఎన్టీఆర్‌కు టీడీపీపైన ప్రేమాభిమానులు పెద్దగా లేవని అర్థమవుతోంది.

Updated On 27 April 2024 1:52 AM GMT
Ehatv

Ehatv

Next Story