పవన్‌(Pawan kalyan)-అల్లు అర్జున్‌(allu arjun) మధ్య టీవీ5(ABN), ఏబీఎన్‌(ABN) గ్యాప్‌ పెంచుతోందా?

పవన్‌(Pawan kalyan)-అల్లు అర్జున్‌(allu arjun) మధ్య టీవీ5(ABN), ఏబీఎన్‌(ABN) గ్యాప్‌ పెంచుతోందా? అంటే అవును అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు రోజుల క్రితం పవన్‌ వ్యాఖ్యలకు ఈ రెండు మీడియా సంస్థలు బాగా హైప్‌ ఇచ్చాయనే చెప్పాలి. కొంత మంది సినిమాల్లో హీరోల కేరెక్టర్ల గురించి పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ, ‘‘నలభైయ్యేళ్ళ క్రితం హీరో అడవులను కాపాడేవాడు.. కానీ, ప్రస్తుతం మాత్రం హీరో అడవులలో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు.. ఇదీ... ప్రస్తుతం మన సినిమా పరిస్థితి’’ అని పవన్ కల్యాణ్‌ అన్నారు. దీంతో ఇక ఈ రెండు మీడియా సంస్థలు రెచ్చిపోయాయి. పవన్‌ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసినవే అంటూ చెప్పుకొచ్చాయి. మెగా, అల్లు కుటుంబాల మధ్య వివాదాలు అంటూ కొనసాగుతూనే ఉన్నాయని వార్తలు వండి వారుస్తున్నారు. ఇరు కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య వివాదాలంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. ఎన్నికల సమయంలో పవన్‌ పిఠాపురం(Pithapuram) నుంచి పోటీ చేస్తే ఒక ట్వీట్‌ చేసి వదిలేసిన అల్లు అర్జున్‌ అదే ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రచారం చేయడంతో వీరిద్దరి మధ్య మరింత గ్యాప్‌ ఏర్పడిందని చెప్తున్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమి ఓవైపు ముమ్మరంగా ప్రచారం చేస్తుంటే, మరోవైపు బన్నీ నేరుగా వెళ్లి ఓ వైసీపీ(YCP) అభ్యర్థికి మద్దతు తెలిపాడు. దీంతో పవన్-బన్నీ ఫ్యాన్స్ మధ్య చిచ్చు తారాస్థాయికి చేరిందని చెప్పుకొచ్చారు. అయితే పవన్‌ తాజా వ్యాఖ్యలు కూడా పరోక్షంగా అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసినవేనని ఈ మీడియా సంస్థలు చెప్పడంతో పవన్-అల్లు అర్జున్‌ మధ్య గ్యాప్‌ మరింత పెంచుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story