తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదంపై సుప్రీంకోర్టులో(Supreme court) ఇవాళ జరిగే విచారణపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదంపై సుప్రీంకోర్టులో(Supreme court) ఇవాళ జరిగే విచారణపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిగింది. సిట్(SIT) కొనసాగించాలా? స్వతంత్ర దర్యాప్తు వేయాలా? అనే అంశం పై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని అడిగింది సుప్రీంకోర్టు. ఇంతకు ముందు జరిగిన విచారణలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) వైఖరిని సుప్రీంకోర్టు(Supreme court) తీవ్రంగా ఎండగట్టింది. దేవుడిని రాజకీయాలలోకి లాగవద్దని హితవు పలికింది.

తిరుమల లడ్డూ వివాదంపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం పదిన్నరకు విచారణ జరపనున్న జస్టిస్‌ గవాయి, జస్టిస్‌ విశ్వనాథన్‌ ధర్మాసనం. దర్యాప్తుపై అభిప్రాయం చెప్పేందుకు సమయం కోరిన సొలిసిటర్ జనరల్‌. దీంతో విచారణను రేపు ఉదయం 10:30కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story