ఇక నుంచి సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు.

ఇక నుంచి సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. అంతేకాక అన్ని మతాల పెళ్లిళ్లకు ఇప్పటినుంచి ఒకటే రూల్ వర్తించనుంది. ఉత్తరాఖండ్‌లో ఈ రూల్ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకేతరహా నిబంధనలు అమల్లోకి వచ్చాయి. గతేడాది ఫిబ్రవరిలో ఈ విధానాన్ని ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ బిల్లును తాము కూడా తీసుకొస్తామని రాజస్థాన్‌ ఇప్పటికే ప్రకటించింది. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుందని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీను అమలు చేస్తామని మాట ఇచ్చా మని.. ప్రధాని మోదీ

నాయకత్వంలో ఆ ఎన్నికల్లో గెలి చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులకు శిక్షణ కూడా ఇప్పించామన్నారు ముఖ్యమంత్రి. తాజాగా యూసీసీ నిర్ణయాన్ని తాము కూడా అమలు చేస్తామని రాజస్థాన్ ప్రకటించింది.

ehatv

ehatv

Next Story