ఓ భర్త, అతని స్నేహితుడు కలిసి భార్యతో నగ్నపూజ చేయించాలని ప్రయత్నించారు.

ఓ భర్త, అతని స్నేహితుడు కలిసి భార్యతో నగ్నపూజ చేయించాలని ప్రయత్నించారు. కుటుంబ సమస్యలు పరిష్కారం కావాలన్నా, కుటుంబం సుఖశాంతులతో ఉండాలంటే భార్యతో నగ్న పూజ చేయించాలని భర్త స్నేహితుడు చెప్పడంతో అందుకు అంగీకరించిన భర్త అదే విషయాన్ని భార్యకు చెప్పడంతో ఆమె అందుకు నిరాకరించింది. బలవంతంగానైనా భార్యతో నగ్నంగా పూజ చేయాలని ప్రయత్నించగా భార్య తిరగబడింది. భర్త, అతని స్నేహితుడు తనను నగ్న పూజ(Nude tradition) చేయాలని కోరారని పోలీసులకు(Police) ఫిర్యాదు చేయడంతో భర్త, అతని స్నేహితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో ఈ సంఘటన జరిగింది.

ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం తాంత్రికునిగా చెప్పుకుంటూ ప్రకాశన్‌ అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చాడని తెలిపింది. కుటుంబ సమస్యలు పరిష్కారం కావాలంటే, కుటుంబంలో సుఖశాంతులతో ఉండాలంటే నగ్న పూజల చేయాలని సూచించాడు. దీంతో తన షెమీర్, ప్రకాశన్ ఇద్దరూ నగ్న పూజ చేయడం వల్ల ఆమె సమస్యలు పరిష్కరిస్తాయని, కుటుంబానికి శ్రేయస్సు చేయడంలో సహాయపడతాయన్నారు. ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే అందుకు మహిళ నిరాకరించడంతో వారు ఆమెను బలవంతం చేశారు. వేధింపులు భరించలేక ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తామరస్సేరి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎ. సాయూజ్ కుమార్ నేతృత్వంలోని బృందం నిందితులను అరెస్టు చేసింది. ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story