Jaya Bachchan : భర్త పేరు జోడించి పిలిచినందుకు జయకు కోపం వచ్చింది!

రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్‌(Jaya Bachchan) సభలో కాసింత అసహనానికి లోనయ్యారు. అందుకు కారణం డిప్యూటీ చైర్‌పర్సన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ తనను భర్త పేరు జోడించి పిలిచినందుకు! జయా బచ్చన్‌ను మాట్లాడాలని కోరుతూ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ అమెను శ్రీమతి జయా అమితాబ్‌ బచ్చన్‌(Jaya Amitabh Bachchan) జీ అని పిలిచారు. మాట్లాడేందుకు లేచిన జయాబచ్చన్‌ కొంత ఆవేశానికి, కొంత అసహనానికి లోనయ్యారు. 'సర్‌.. కేవలం జయాబచ్చన్‌ అంటే సరిపోతుంది' అని ఆమె అన్నారు. పార్ల‌మెంట్ రికార్డుల్లో పూర్తి పేరు రాసి ఉంద‌ని, అందుకే జ‌యా అమితాబ్ బ‌చ్చ‌న్ అని పిలవాల్సి వచ్చిందని ఆయన బదులిచ్చారు. ఇది చాలా కొత్త‌గా ఉంద‌ని, భ‌ర్త పేరుతోనే మ‌హిళ‌కు గుర్తింపు వ‌స్తుందా? అని జయా బచ్చన్‌ గట్టిగానే అడిగారు. మ‌హిళ‌ల‌కు సొంతంగా ఉనికి లేదా? వాళ్లు సొంతంగా ఏమీ సాధించ‌లేరా? అని జయబచ్చన్‌ అడిగారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story