అర్థరాత్రి నుంచి దేశరాజధాని డిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పొద్దుపొద్దున్నే పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

అర్థరాత్రి నుంచి దేశరాజధాని డిల్లీ(Delhi)లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పొద్దుపొద్దున్నే పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పలు కాలనీల్లో కార్లు, బైకులు నీట మునిగాయి. జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు ఢిల్లీఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌-1(Delhi Airport T1) వద్ద పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, టెర్మినల్‌-1 వద్ద కార్యకలాపాల్ని అధికారులు నిలిపివేశారు. ఈ రోజు తెల్లవారుజామున ఈదురు గాలుల వాన ధాటికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌-1 వద్ద పైకప్పు కూలిపోయింది. ఘటనలో కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఒకరు చనిపోయారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు మొదలయ్యాయి. ఫైర్‌ సిబ్బంది క్షతగాత్రుల్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండడంతో.. టెర్మినల్‌ వద్ద కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సహాయక చర్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు(Minister Rommohan Naidu) ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా తెలిపారు.కూలిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌-1 పై కప్పు.. ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు

Updated On
Eha Tv

Eha Tv

Next Story