హర్యానా రాష్ట్రం నుహ్ జిల్లాలో.. రామ్ కిషన్ అనే పెద్దాయన.. హడావుడిగా పోలీస్ స్టేషన్‌కి వచ్చి.. ఓ విషయం చెప్పాడు.

హర్యానా రాష్ట్రం నుహ్ జిల్లాలో.. రామ్ కిషన్ అనే పెద్దాయన.. హడావుడిగా పోలీస్ స్టేషన్‌కి వచ్చి.. ఓ విషయం చెప్పాడు. పోలీసులు షాక్ అయ్యారు. అన్ని పనులూ ఆపేసి.. అతనివైపు ఆశ్చర్యంగా చూశారు. “నిజమా” అని అడిగితే.. నిజం సార్.. అంటూ.. లబోదిబోమన్నాడు ఆయన. పోలీసులు మొదట నమ్మనప్పటికీ తర్వాత ఆశ్చర్యపోయారు. కాస్త వివరంగా చెప్పండి అన్నారు.. అప్పుడు అతను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాడు.

రామ్ కిషన్ మొదటి భార్య చనిపోయింది. ఆ తర్వాత గురుగ్రామ్ లోని సోహ్నా ఏరియాకి చెందిన మోనిక అనే మహిళను పెళ్లిచేసుకున్నాడు. ఐతే.. మొదటి భార్యకు ఒక కొడుకు ఉన్నాడు. అతనికి 17 ఏళ్లు. అతను కూడా అదే ఇంట్లో తండ్రితో ఉంటున్నాడు. అతనికి మోనిక సవతి తల్లిలా ఇంట్లోకి ఎంటరైంది. ఆ కుర్రాడు ఆమెతో చాలా గౌరవంగా, పద్ధతిగా ఉండసాగాడు. అది చూసి రామ్ కిషన్ ఆనందించాడు. రెండో భార్య.. తన కొడుక్కి సవతి తల్లిలా కాకుండా.. దాదాపు తల్లిలాగే ఉంటోంది అని సంతోషించాడు.

ఆ కుర్రాడు ఆమెను.. అమ్మా అని పిలిచేవాడు. ఎప్పుడైనా ఆమెకు ఒంట్లో నలతగా ఉంటే.. ఇంటి పనులు కూడా చేసి పెట్టేవాడు. అది చూసి.. తన కొడుకు చాలా మంచివాడనీ, సవతి తల్లికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నాడని ఆనందపడ్డాడు. ఇలా నెలలు గడుస్తుండగా.. ఓ రోజు వాళ్లిద్దరూ ఇంట్లో కనిపించలేదు. ఆమెకీ, కొడుక్కీ కాల్ చేస్తే.. స్పందన లేదు. రామ్ కిషన్‌కి మతిపోయింది. ఆ తర్వాత ఊళ్లో ఎవరో.. నీ భార్యా, కొడుకూ.. బస్సెక్కుతుండగా చూశానని ఎవరో చెప్పారు. దాంతో.. ఏమైందో అర్థం కాక.. రామ్ కిషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్లు.. మొబైల్ IMEI నంబర్ ఆధారంగా.. ఆ ఇద్దరూ ఎక్కడున్నారో కనిపెట్టారు.

పోలీసులు వాళ్లను కనిపెట్టి.. వివరాలు అడిగితే.. తాము కోర్టు మ్యారేజ్ చేసుకున్నామని వాళ్లు తెలిపారు. ఇద్దరి వయసు ఎంత అని అడిగితే.. మోనిక తనకు 40 ఏళ్లనీ, ఆ అబ్బాయికి 21 ఏళ్లనీ చెప్పింది. తామిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని చెప్పింది. దాంతో పోలీసులు వాళ్లను వదిలేశారు. తర్వాత రామ్ కిషన్‌కి కాల్ చేసి.. వాళ్లు కోర్టు మ్యారేజ్ చేసుకున్నారనీ, తాము చేసేదేమీ లేదని చెప్పేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రామ్‌కిషన్‌ ఉండిపోయాడు.

ehatv

ehatv

Next Story