విపక్ష ఎమ్మెల్యేలు అధికారపక్షంలోకి జంప్‌ చేయడమన్నది రివాజు. అంతే కానీ అధికారాన్ని అనుభవిస్తున్న ఎమ్మెల్యేలు చూస్తూ చూస్తూ ప్రతిపక్షంలోకి వెళతారా?

విపక్ష ఎమ్మెల్యేలు అధికారపక్షంలోకి జంప్‌ చేయడమన్నది రివాజు. అంతే కానీ అధికారాన్ని అనుభవిస్తున్న ఎమ్మెల్యేలు చూస్తూ చూస్తూ ప్రతిపక్షంలోకి వెళతారా? ఏమో మహారాష్ట్రలో అదే జరగవచ్చు! లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడి రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ (sharad Pawar) నాయకుడు రోహిత్‌ పవార్‌ చెబుతున్నదాని ప్రకారం వర్షాకాల అసెంబ్లీ సమావేశాల తర్వాత మహా రాజకీయాలలో పెను మార్పులు జరగవచ్చట! ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవర్‌(Ajit Pawar) నేతృత్వంలో ఉన్న అధికార ఎన్సీపీ నుంచి ఓ 19 మంది ఎమ్మెల్యేలు మళ్లీ శదర్‌ పవార్‌ చెంతకు వచ్చే అవకాశం ఉందని రోహిత్(Rohit) అంటున్నారు. వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే అజిత్ పవార్‌ వర్గం ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతారట! లాస్టియర్‌ జులైలో నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీలో చీలిక ఏర్పడింది. కొందరు ఎమ్మెల్యేలు అజిత్‌ పవార్‌ వైపు వెళ్లారు. వారంతా ఇప్పటి వరకు శరద్‌ పవార్‌ పైన కానీ, ఇతర సీనియర్‌ నాయకులపై కానీ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదన్న విషయాన్ని రోహిత్‌ గుర్తు చేశారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే.. ‘అజిత్‌ వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. తమ నియోజకవర్గం అభివృద్ధి పనుల నిధుల కోసమే అసెంబ్లీ సమావేశాలలో పాల్గొంటారు. నిధులు మంజూరు కాగానే వారంతా అజిత్‌ వర్గం నుంచి బయటకు వచ్చేస్తారు'అని రోహిత్‌ పవార్‌ అన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story