జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు అధికారులు శనివారం తెలిపారు

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు అధికారులు శనివారం తెలిపారు. నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా, అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్ ప్రాంతంలో భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జాయింట్ ఆపరేషన్ ప్రారంభించింది.

అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలకు చెందిన ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు గాయపడినట్లు ఆర్మీ ధృవీకరించింది. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గాయపడిన ప్రజలకు తక్షణ వైద్య సహాయం అందించారు. మెరుగైన వైద్యం అందించారని భారత సైన్యం తెలిపింది. ఈ ఎన్ కౌంటర్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story