బెంగళూరులోని పరప్పన అగ్రహారాలో నిర్మాణంలో ఉన్న భవనంలోని 13వ అంతస్తు నుంచి పడి 20 ఏళ్ల యువతి మరణించింది.

బెంగళూరులోని పరప్పన అగ్రహారాలో నిర్మాణంలో ఉన్న భవనంలోని 13వ అంతస్తు నుంచి పడి 20 ఏళ్ల యువతి మరణించింది. ఆమె ఆ భవనంలోకి అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు స్నేహితుల బృందంతో కలిసి లేట్‌ నైట్‌ పార్టీకి వెళ్లిందని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా రీల్‌ను షూట్ చేయడానికి ఆ మహిళ టెర్రస్ పైకి వెళ్లి ప్రమాదవశాత్తు లిఫ్ట్ షాఫ్ట్ ప్రదేశంలో పడిపోయింది. బాధితురాలు, బీహార్‌(Bihar)కు చెందినది, నగరంలోని ఒక షాపింగ్ మార్ట్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ సంఘటన తర్వాత, ఆమె స్నేహితులు అక్కడి నుండి పారిపోయారు.

ఈ సంఘటనను డీసీపీ (South East) ఫాతిమా ధ్రువీకరిస్తూ, "అవును, వారు భవనంలో పార్టీ చేసుకుంటున్నారు. తరువాత రీల్స్ రికార్డ్ చేయడానికి వారు టెర్రస్ పైకి వెళ్ళారు, ఆమె జారిపడి మరణించిందని చెప్పారు. అయితే ఈ నలుగురు మధ్య రిలేషన్‌ షిప్‌పై వివాదం చెలరేగినట్లు సమాచారం. పరప్పన అగ్రహార పోలీసులు ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ehatv

ehatv

Next Story