ప్రస్తుతం దేశమంతా రాముడి ధ్యానంలో ఉంది. చూపంతా అయోధ్యవైపు(Ayodhya) ఉంది. ఎప్పుడెప్పుడు జనవరి 22 అవుతుందా అని ఎదురుచూస్తోంది. మరోవైపు జనవరి 22వ తేదీన జరిగే మహా సంప్రోక్షణ మహోత్సవానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి(Presidant), ప్రధానితో(PM) పాటు భారీ సంఖ్యలో ప్రముఖులు హాజరవుతున్నారు. లక్షలాది భక్తులు అయోధ్యకు తరలిరానున్నారు.

ప్రస్తుతం దేశమంతా రాముడి ధ్యానంలో ఉంది. చూపంతా అయోధ్యవైపు(Ayodhya) ఉంది. ఎప్పుడెప్పుడు జనవరి 22 అవుతుందా అని ఎదురుచూస్తోంది. మరోవైపు జనవరి 22వ తేదీన జరిగే మహా సంప్రోక్షణ మహోత్సవానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి(Presidant), ప్రధానితో(PM) పాటు భారీ సంఖ్యలో ప్రముఖులు హాజరవుతున్నారు. లక్షలాది భక్తులు అయోధ్యకు తరలిరానున్నారు. వచ్చిన అతిథులందరి ఆకలిదప్పులను తీర్చాలి కదా! అందుకే దేశం నలుమూలల నుండి ప్రజలు కూరగాయలు(Vegetables), బియ్యం(Rice), ఇతర ఆహార పదార్థాలను అయోధ్యకు పంపుతున్నారు.రామ మందిర ప్రారంభోత్సవ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి వారికి సరిపోయేలా భారీ ఎత్తున వంటలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వంటశాలలు కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో బియ్యం, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలతో సహా సుమారు 300 టన్నుల ఆహార రేషన్ అయోధ్యకు వస్తున్నట్లు అంచనా. ఈ ఆహారం అంతా అయోధ్య లోని కార్యశాలలో నిల్వ చేస్తారు.

Updated On 3 Jan 2024 6:46 AM GMT
Ehatv

Ehatv

Next Story