అతుల్ సుభాశ్ ఆత్మహత్య తరహాలో భార్య వేధింపులు భరించలేక ప్రముఖ కేఫ్‌ యజమానికి ఆత్మహత్య చేసుకున్నారు.

అతుల్ సుభాశ్ ఆత్మహత్య తరహాలో భార్య వేధింపులు భరించలేక ప్రముఖ కేఫ్‌ యజమానికి ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని కళ్యాణ్ విహార్‌(Kalyan vihar) ప్రాంతానికి చెందిన పునీత్ ఖురానా(40), అతని భార్య మానికా జగదీశ్ పహ్వా ఇద్దరు కలిసి ఉడ్‌బాక్స్ కేఫ్ అనే బేకరి పెట్టారు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకోగా, ఆ కేసు కోర్టులో నడుస్తుంది. పునీత్‌ను అతని భార్య మానికా ఫోన్ చేసి మనం విడాకులు తీసుకున్నాం.. కానీ, నేను ఇంకా వ్యాపార భాగస్వామినే.. నాకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే అంటూ వేధింపులకు గురిచేసింది. దీంతో తన ఇంట్లో పునీత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. పునీత్ ఫోన్‌లో తన భార్యతో మాట్లాడిన 16 నిమిషాల కాల్ రికార్డ్‌ను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పునీత్ భార్యను విచారణకు హాజరు కావాలని నోటీసు పంపారు.

Updated On
ehatv

ehatv

Next Story