కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని చంపుతామని గత ఏడాది హత్య బెదిరింపులతో కూడిన లేఖ పంపిన 60 ఏళ్ల వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోకి ప్రవేశించిన వెంటనే రాహుల్ గాంధీపై బాంబులు వేస్తామని 60 ఏళ్ల వ్యక్తి లేఖ ద్వారా బెదిరించాడు. ఇండోర్‌లోని ఓ స్వీట్ షాప్ బయట ఆ లేఖ కనిపించింది.

60-year-old man arrested in Indore for sending death threat to Rahul Gandhi
కాంగ్రెస్(Congress) అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని చంపుతామని గత ఏడాది హత్య బెదిరింపులతో కూడిన లేఖ పంపిన 60 ఏళ్ల వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ఇండోర్‌లోకి ప్రవేశించిన వెంటనే రాహుల్ గాంధీపై బాంబులు వేస్తామని 60 ఏళ్ల వ్యక్తి లేఖ ద్వారా బెదిరించాడు. ఇండోర్‌లో(Indore)ని ఓ స్వీట్ షాప్(Sweet Shop) బయట ఆ లేఖ కనిపించింది. దయాసింగ్(Daya Singh) అలియాస్ ఐశిలాల్ ఝమ్(Aishilal Jham) రైలులో పారిపోబోతున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు.. జాతీయ భద్రతా చట్టం(National Security Act) కింద అరెస్ట్ చేశారు.
ఐశిలాల్ ఝామ్(Aishilal Jham)ను ఎన్‌ఎస్‌ఏ(NSA) కింద జైలులో పెట్టాలని జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్ బ్రాంచ్) నిమిష్ అగర్వాల్(Nimish Agrawal) తెలిపారు. నిందితుడు రాహుల్ గాంధీకి ఎందుకు లేఖ పంపాడనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, విచారణ జరుగుతోందని అగర్వాల్ అన్నారు. నవంబర్ 2022లో లేఖను గుర్తించిన వెంటనే.. పోలీసులు(Police) గుర్తు తెలియని వ్యక్తిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 507 కింద కేసు నమోదు చేశారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
