ఐదేళ్ల బాలుడు మంచంపై మూత్ర విసర్జన చేసాడని ఆగ్రహించిన అతని సవతి తల్లి(step mother) దారుణమైన నిర్ణయం తీసుకుంది

ఐదేళ్ల బాలుడు మంచంపై మూత్ర విసర్జన చేసాడని ఆగ్రహించిన అతని సవతి తల్లి(step mother) దారుణమైన నిర్ణయం తీసుకుంది. పిల్లాడు అనే కనికరం కూడా చూపకుండా అతడి ప్రైవేట్ భాగాలకు(Private part) వాతలు(Brunt) పెట్టింది.

మధ్య ప్రదేశ్(Madhya Pradesh) లోని గుణ జిల్లాలోని చచోడా ప్రాంతంలో బాలుడి ప్రైవేట్ భాగాలను కాల్చింది. పిల్లాడి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు సవతి తల్లిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితురాలిని బర్బత్ పురా నివాసి రైజా బానో (44)గా గుర్తించారు. బాలుడి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆమె మనవడు నిద్రలో మంచంపై మూత్ర విసర్జన చేశాడు. బాలుడి సవతి తల్లి రజియా.. పిల్లవాడిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టింది. బాలుడి తుంటి, మణికట్టు, ప్రైవేట్ భాగాలు, గడ్డంపై గరిటెతో కాల్చింది. బాలుడికి పలుచోట్ల కాలిన గాయాలైనట్లు పోలీసులు నిర్ధారించారు.

పిల్లాడి అమ్మమ్మ, తండ్రి జోక్యం చేసుకుని బినాగంజ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి పిల్లాడిని తీసుకెళ్లి చికిత్స అందించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story