జమ్ముకశ్మీర్‌లోని(Jammu kashmir) కుప్వారా ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

జమ్ముకశ్మీర్‌లోని(Jammu kashmir) కుప్వారా ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. రాత్రి నుంచి కొనసాగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో(encouter) భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ(army) జవాను గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇండియన్‌ ఆర్మీకి చెందిన చినార్‌ కార్ప్స్‌ ఎక్స్‌ (twitter) ద్వారా తెలిపింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా సరిహద్దు జిల్లా లోలాబ్‌లో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి కచ్చితమైన సమాచారం అందడంతో భారత సైన్యం, జమ్ము కశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story