దీపావళి(Depavali) పండుగ దగ్గరకొచ్చేసింది. జనం సొంతూళ్లకు వెళుతున్నారు.

దీపావళి(Depavali) పండుగ దగ్గరకొచ్చేసింది. జనం సొంతూళ్లకు వెళుతున్నారు. బస్టాండ్‌లు(Bustands), రైల్వేస్టేషన్లు(Railway stations) కిటకిటలాడుతున్నాయి. ముంబాయి రైల్వేస్టేషన్‌లు(Mumbai raiway station) అయితే కిక్కిరిసిపోతున్నాయి. బాంద్రా( Bandra) టెర్మినస్‌లో అయితే భారీ తొక్కిసలాట(stampede) కూడా జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వందలాది మంది ప్రయాణికులు బాంద్రా టెర్మినస్‌లోని ఒకటో నంబర్‌ ప్లాట్ ఫామ్‌లో ట్రైన్‌ కోసం ఎదురుచూస్తున్నప్పుడు బాంద్రా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్లాల్సిన నంబర్ 22921 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. దాంతో ప్రయాణికులు ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు పరుగులు తీశారు. దాంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ తొమ్మిది మంది ప్రయాణికులను రైల్వే భద్రత సిబ్బంది, జనరల్ పోలీసులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఒకరిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెసింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story