ఓ మహిళ తన భర్తను వదిలేసి మరో వ్యక్తితో పారిపోయింది. దీంతో తన భార్య ఆచూకీ తెలపాలని ఆ మహిళ భర్త బెంగళూరులోని (Bangalore) పుట్టేనహళ్లి (PuttenaHalli) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తన భర్తను వెతికిపెట్టాలని మహిళతో పారిపోయిన వ్యక్తి భార్య కూడా పోలీసులను ఆశ్రయించింది. బెంగళూరు నగరంలోని ఇలియాస్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే..

illegal affair-compressed

బెంగళూరులో నివాసం ఉండే సుమయ్య బాను (Sumayya banu) అలియాస్ బాను అనే మహిళ, వాసీం (wasim) అనే వ్యక్తితో ఏడేళ్ల కింద పెళ్లి చేసుకున్నారు. వాసీం, బాను దంపతులకు మూడేళ్ల కూతురు కూడా ఉంది. భార్య, కూతురుతో సంతోషంగా ఉండేవారు. రెండేళ్ల కింద వాసీంకు దిల్ షాద్ (Dilshaad) అనే మహిళ పరిచయమైంది. దిల్ షాద్‌కు నయీమ్ (Nayeem) అనే వ్యక్తితో పెళ్లయింది. భర్త నయీమ్‌తో కలిసి దిల్ షాద్ సంతోషంగానే ఉండేది. అయితే వాసీంతో పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వాసీం, దిల్ షాద్ బయట కలుస్తూ సెక్స్ చేసుకోవడం ప్రారంభించారు. భర్త నయియ్‌కు కట్టు కహానీలు చెప్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లి ప్రియుడు వాసీంతో ఎంజాయ్ చేసేది. వాసీం కూడా అతని భార్య బానుకు మాయమాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి అతని ప్రియురాలు దిల్ షాద్‌తో ఆ పని కానిచ్చేవాడు. కొన్ని నెలలగా భర్త వాసీం వ్యవహారంపై భార్య బానుకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో నాలుగురోజుల క్రితం భర్త వాసీంకు అనుమానం రాకుండా బాను అతని వెంట నడిచింది. జేపీనగర్‌లోని ఓ హోటల్‌లో వాసీం, దిల్‌షాద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులను వాసీం, దిల్‌షాద్‌లను చితకబాదారు. తర్వాత పుట్టేనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేశారు. పోలీసులు మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఇద్దరినీ వదిలేశారు. ఎవరింటికి వారు వెళ్లిన తర్వాత ఇద్దరు మరోసారి బయట కలుసుకుని అటు నుంచి అటే చెక్కేశారు. దీంతో తన భార్య ఆచూకీ తెలపాలని దిల్‌షాద్ భర్త నయీమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన భర్తను వెతికి పెట్టాలని వాసీం భార్య బాను కూడా పోలీసులను ఆశ్రయిండంతో దిక్కుతోచని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు.