అమెరికాలో(America) దుండగుల కాల్పులలో(Gun Firing) తీవ్రంగా గాయపడిన ఆదిత్య(Aaditya) అడ్లఖా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఓహియోలో(Ohio) యూనివర్సిటీ ఆఫ్‌ సిన్సినాటిలో(University of Cincinnati) డాక్టరేట్‌ చేస్తున్న 26ఏళ్ల ఆదిత్య ఈ నెల 9వ తేదీన కారులు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు.

అమెరికాలో(America) దుండగుల కాల్పులలో(Gun Firing) తీవ్రంగా గాయపడిన ఆదిత్య(Aaditya) అడ్లఖా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఓహియోలో(Ohio) యూనివర్సిటీ ఆఫ్‌ సిన్సినాటిలో(University of Cincinnati) డాక్టరేట్‌ చేస్తున్న 26ఏళ్ల ఆదిత్య ఈ నెల 9వ తేదీన కారులు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆదిత్య తీవ్రంగా గాయపడ్డారు. కారు అదుపుతప్పి గోడను ఢీకొని ఆగిపోయింది. పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈనెల 18వ తేదీన తుదిశ్వాస విడిచాడు. ఆదిత్య అడ్లఖా(Aaditya Adlakha) ఢిల్లీలోని(Delhi) రాంజస్‌ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశాడు. 2020లో ఎయిమ్స్‌లో ఫిజియాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేశాడు. తర్వాత సిన్సినాటి యూనివర్సిటీలో చేరారు. దుండగులు ఆదిత్యపై ఎందుకు కాల్పులు జరిపారో తెలియదు. పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 23 Nov 2023 11:36 PM GMT
Ehatv

Ehatv

Next Story