కన్నడ చిత్రసీమలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి(Renuka Swamy) హత్య కేసులో(Murder Case) హీరో దర్శన్‌(Darshan), నటి పవిత్ర నిందితులుగా జైల్లో ఉన్నారు.

కన్నడ చిత్రసీమలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి(Renuka Swamy) హత్య కేసులో(Murder Case) హీరో దర్శన్‌(Darshan), నటి పవిత్ర నిందితులుగా జైల్లో ఉన్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో వీరితో పాటు మరో 15 మంది కటకటాలు లెక్కిస్తున్నారు. దర్శన్‌ అరెస్ట్‌పై సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది రియాక్టయ్యారు. ఇప్పటి వరకు నటి, రాజకీయ నాయకురాలు సుమలత అంబరీష్‌(suma Latha ambarish) స్పందించలేదు. ఇన్నాళ్లకు ఆమె దర్శన్‌తో తనకు ఉన్న బంధాన్ని ఓ లేఖ ద్వారా వివరించారు. 'నాలుగున్నర దశాబ్దాలుగా నేను సినిమా రంగంలో ఉన్నాను. నటిగా, కళాకారిణికి జీవిస్తున్నాను. అయిదేళ్లపాటు లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నాను. అనేక రంగాలలో బాధ్యతలను నిర్వర్తించాను. నేను ఎప్పుడూ అనవసరమైన వ్యాఖ్యలు చేయలేదు. చేయడం వృధా. నా కుటుంబంతో దర్శన్‌ కుటుంబానికి ఉన్న బంధం ఏమిటో మీకు అర్థం కాదు. అతడు స్టార్‌ కాక మునుపే పాతికేళ్లుగా నాకు తెలుసు. స్టార్‌డమ్‌కు మించి దర్శన్‌ నాకు కుటుంబసభ్యుడు. కొడుకులాంటి వాడు. అంబరీష్‌ను ఎప్పుడూ నాన్నగా పిలిచేవాడు. ఏ తల్లి కొడుకును ఇలాంటి పరిస్థితిలో చూడటానికి ఇష్టపడదు. నాకు తెలిసిన దర్శన్ ఎప్పుడూ ఇలాంటి నేరం చేయడు. ప్రేమ, ఉదార ​​హృదయం ఉన్న వ్యక్తిగా మాత్రమే దర్శన్‌ నాకు తెలుసు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే మంచి మనసు అతడిది. దర్శన్ అటువంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను బలంగా నమ్ముతున్నాను' అని సుమలత తన లేఖలో రాశారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను ఇకపై ఏమీ మాట్లాడనని చెప్పారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిని సుమలత తప్పుబట్టారు. 'దర్శన్ ఇప్పటికీ నిందితుడే.. అతనికి వ్యతిరేకంగా ఏదీ నిరూపించబడలేదు, శిక్షించబడలేదు. దర్శన్‌కు న్యాయమైన విచారణ జరగనివ్వండి. దర్శన్‌ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడకండి. దర్శన్‌ విషయం వల్ల ఇప్పటికే శాండల్‌వుడ్‌ స్తంభించిపోయింది.' అని లేఖను ముగించారు సుమలత. ఇదిలా ఉంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న దర్శన్‌, అతడి అనుచరులకు కోర్టు కస్టడీని ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. బెయిల్‌ లభిస్తుందని అనుకున్న దర్శన్‌కు నిరాశే మిగిలింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story