బెంగళూరు(Bangalore) నగరంలో గంటల తరబడి ట్రాఫిక్‌లో(Traffic) ఇరుక్కుపోయే పరిస్థితి ఇకపై ఉండదు.

బెంగళూరు(Bangalore) నగరంలో గంటల తరబడి ట్రాఫిక్‌లో(Traffic) ఇరుక్కుపోయే పరిస్థితి ఇకపై ఉండదు. కాలుష్యం బెడద అసలే ఉండదు. ఎందుకంటే ఆ నగరంలో ఎగిరే ట్యాక్సీలు రాబోతున్నాయి. తక్కువ ఎత్తులో పర్యావరణ రహిత ప్రయాణ సేవలను అందించడానికి బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు రెడీ అయ్యింది. ఇందుకోసం సార్లా ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఇందిరానగర్‌(Indira nagar) నుంచి విమానాశ్రయానికి చేరుకోవాలంటే ఇంచుమించు రెండు గంటలు పడుతున్నది. అదే ఎగిరే ట్యాక్సీలు వస్తే అయిదు నిమిషాల్లో గమ్యం చేరుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రారంభదశలోనే ఉందని, ఈ సేవలు అందుబాటులోకి రావడానికి రెండుమూడేళ్లు పడుతుందని సార్లా ఏవియేషన్‌ సీఈఓ అడ్రియన్‌ ష్మిత్‌ అన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story