అసోంలోని(assam) కామాఖ్యా ఆలయంలో(Kamakhya Temple) వార్షిక అంబుబాచి మేళా(Ambubachi fest) మొదలయ్యింది

అసోంలోని(assam) కామాఖ్యా ఆలయంలో(Kamakhya Temple) వార్షిక అంబుబాచి మేళా(Ambubachi fest) మొదలయ్యింది. నీలచలకొండపై ఉన్న శక్తిపీఠం కామాఖ్య ఆలయాన్ని ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు మూసివేస్తారు. అమ్మ‌వారి వార్షిక నెల‌స‌రి సంద‌ర్భంగా ఆల‌య ద్వారాల‌ను మూసివేసి మ‌ళ్లీ నాలుగు రోజుల త‌ర్వాత తెర‌వ‌నున్నారు. అంబుబాచి మేళా కోసం ల‌క్ష‌లాది మంది భ‌క్తులు ఇప్పటికే గౌహ‌తి చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు. ఆల‌య ద్వారాలు తెరిచిన త‌ర్వాత పూజలు చేసిన పిదపే భక్తులు అక్కడ్నుంచి వెళతారు. ఇవాళ ఉద‌యం 8.43 నిమిషాల‌కు ఆల‌య ద్వారాల‌ను మూసివేశారు. దీంతో ప్ర‌భృత్తి మొద‌లైన‌ట్లు తెలిపారు. మ‌ళ్లీ జూన్ 25వ తేదీన రాత్రి 9.07 నిమిషాల‌కు నిబృత్తి ద్వారా ఆల‌య ద్వారాల‌ను తెర‌వ‌నున్నారు. మంగ‌ళ‌ర‌క‌మైన స్నానం త‌ర్వాత ఆల‌యంలో ద‌ర్శ‌నాలు ప్రారంభం అవుతాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story