ఈ భూమ్మీద కల్తీ లేనిది ఏదైనా ఉందంటే అది తల్లిపాలేనని ఇన్నాళ్లు అనుకున్నాం! చివరికి తల్లిపాలు కూడా కలుషితం అవుతున్నాయి. అమెరికా(America), ఆస్ట్రియా(Austria) దేశాలు జరిపిన తాజా పరిశోధనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటకు వచ్చాయి. ప్లాస్టిక్‌(Plastic) ఉపయోగం మనిషి మనుగడకు తీవ్రమైన ముప్పు తెస్తున్నది. ఆ మాటకొస్తే సమస్త జీవరాశులకు ప్లాస్టిక్ ముప్పుగా మారింది. అత్యంత సూక్ష్మరూపంలో ఉండే ప్లాస్టిక్‌ రేణువులు గాలిలో చేరుతున్నాయి.

ఈ భూమ్మీద కల్తీ లేనిది ఏదైనా ఉందంటే అది తల్లిపాలేనని ఇన్నాళ్లు అనుకున్నాం! చివరికి తల్లిపాలు కూడా కలుషితం అవుతున్నాయి. అమెరికా(America), ఆస్ట్రియా(Austria) దేశాలు జరిపిన తాజా పరిశోధనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటకు వచ్చాయి. ప్లాస్టిక్‌(Plastic) ఉపయోగం మనిషి మనుగడకు తీవ్రమైన ముప్పు తెస్తున్నది. ఆ మాటకొస్తే సమస్త జీవరాశులకు ప్లాస్టిక్ ముప్పుగా మారింది. అత్యంత సూక్ష్మరూపంలో ఉండే ప్లాస్టిక్‌ రేణువులు గాలిలో చేరుతున్నాయి. అవి మనం తీసుకునే అన్న పానీయాలలో(Food) కలుస్తున్నాయి. ఆహారం ద్వారా అవి మన శరీరంలో ప్రవేశిస్తున్నాయి. గుండె, మెదడు, మూత్రపిండాలు, కాలేయం ఇలా మన శరీరంలోని ప్రతి అవయంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే తల్లిపాలలో కూడా ప్లాస్టిక్‌ రేణువులు ఉండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం! పరిశోధనలో ఈ భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి పాల(Breast Milk) ద్వారా అప్పుడే పుట్టిన పిల్లలకు ఆహారంగా ప్లాస్టిక్ రేణువులు మారుతున్నాయట! దీంతో పాటు మగవారి వీర్య కణాల(Sperm) లోకూడా మైక్రోప్లాస్టిక్(Micro Plastic) ఆనవాళ్లను గుర్తించారు పరిశోధకులు. దీని ద్వారా సంతానోత్పత్తిపై కూడా ప్లాస్టిక్ ప్రభావం పెద్దగా ఉందని చెబుతున్నారు. తాజా ఫలితాలను బట్టి పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్లాస్టిక్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టు అమెరికా, ఆస్ట్రియా పరిశోధ కులు తెలిపారు. 30 మంది పురుషుల నుంచి సేకరించిన వీర్యకణాలను విశ్లేషిస్తే 11 నమూనాల్లో మైక్రోప్లాస్టిక్‎ను గుర్తించినట్టు తెలిపారు. మనం రోజూ తాగే లీటర్ వాటర్‌ బాటిల్లో 2,40,000 ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

Updated On 15 March 2024 1:02 AM GMT
Ehatv

Ehatv

Next Story