2024 Military Strength Rankings : ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ ఫోర్స్ ఉన్న దేశం..
ప్రపంచవ్యాప్తంగా అమెరికా(America) అత్యంత శక్తివంతమైన మిలిటరీ(Military ) దేశంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా(Russia), చైనా(China) ఉన్నాయి. ప్రపంచ రక్షణ సమాచారాన్ని ట్రాక్ చేసే వెబ్‌సైట్ గ్లోబల్ ఫైర్‌పవర్(Global Firepower) నివేదిక ప్రకారం భారతదేశం(India) నాలుగో స్థానంలో ఉంది.

2024 Military Strength Rankings
ప్రపంచవ్యాప్తంగా అమెరికా(America) అత్యంత శక్తివంతమైన మిలిటరీ(Military ) దేశంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా(Russia), చైనా(China) ఉన్నాయి. ప్రపంచ రక్షణ సమాచారాన్ని ట్రాక్ చేసే వెబ్‌సైట్ గ్లోబల్ ఫైర్‌పవర్(Global Firepower) నివేదిక ప్రకారం భారతదేశం(India) నాలుగో స్థానంలో ఉంది. అన్నింటి కంటే తక్కువ మిలిటరీ స్థానం ఉన్నదేశాల్లో భూటాన్(Bhutan) చిట్ట చివరన ఉంది. 2024 గ్లోబల్ ఫైర్‌పవర్ 145 దేశాలకు ర్యాంకింగ్ ప్రకటించింది. సైనికుల(Soliders) సంఖ్య, సైనిక పరికరాలు, ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక స్థానం, అందుబాటులో ఉన్న వనరులు వంటి 60 కంటే ఎక్కువ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక ఇచ్చారు.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీలను కలిగి ఉన్న టాప్ 10 దేశాలు: అమెరికా, రష్యా, చైనా. భారత్, దక్షిణ కొరియా(South Korea), యునైటెడ్ కింగ్‌డమ్(UK), జపాన్(Japan), టర్కీ(Turkey), పాకిస్తాన్(Pakistan), ఇటలీ(Italy)
ప్రపంచంలో అతి తక్కువ శక్తివంతమైన మిలిటరీని కలిగి ఉన్న 10 దేశాలు: భూటాన్, మోల్డోవా, సురినామ్, సోమాలియా, బెనిన్, లైబీరియా
బెలిజ్, సియర్రా లియోన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఐస్లాండ్
