విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు(Passport) ఒక్కటే ఉంటే సరిపోదూ.. వీసా(Visa) కూడా కావాలి. నేపాల్‌(Nepal), భూటాన్‌(Butan), శ్రీలంక(Srilanka) వంటి దేశాలకు మినహాయింపు ఉందనుకోండి. లేటెస్ట్‌గా మలేషియా(Malesiya) ప్రభుత్వం కూడా భారతీయులకు ఈ వెసులుబాటు కల్పించింది. ఇండియన్స్‌ ఇక నుంచి వీసా లేకుండా ఆ దేశానికి హాయిగా వెళ్లవచ్చు.

విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు(Passport) ఒక్కటే ఉంటే సరిపోదూ.. వీసా(Visa) కూడా కావాలి. నేపాల్‌(Nepal), భూటాన్‌(Butan), శ్రీలంక(Srilanka) వంటి దేశాలకు మినహాయింపు ఉందనుకోండి. లేటెస్ట్‌గా మలేషియా(Malasiya) ప్రభుత్వం కూడా భారతీయులకు ఈ వెసులుబాటు కల్పించింది. ఇండియన్స్‌ ఇక నుంచి వీసా లేకుండా ఆ దేశానికి హాయిగా వెళ్లవచ్చు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఇదిఅమలులోకి వస్తుందని, వీసా లేకుండా 30 రోజుల పాటు తమ దేశంలో ఉండవచ్చని మలేషియా ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీం(Anwar Ibrahim) తెలిపారు. ఈ అవకాశాన్ని భారతీయులతో పాటు చైనా(China) దేశస్తులకు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. టూరిజాన్ని ప్రోత్సహించడానికి మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మలేషియా ఆర్ధిక పరిపుష్టికి పర్యాటకరంగం అభివృద్ధి చాలా ముఖ్యమని అన్వర్‌ ఇబ్రహీం అన్నారు. భారతీయులకు వీసా అవసరం లేకుండానే పర్యటించే సౌలభ్యాన్ని ఇటీవల థాయిలాండ్‌, శ్రీలంక ప్రభుత్వాలు కూడా కల్పించాయి.

Updated On 27 Nov 2023 1:30 AM GMT
Ehatv

Ehatv

Next Story