Chicago : చికాగోలో దారుణం.. హైదరాబాద్ స్టూడెంట్‌పై దాడి
అమెరికాలో(America) భారతీయ విద్యార్థులపై(Indian students) దాడులు పెరుగుతున్నాయి. లేటెస్ట్‌గా హైదరాబాద్ లంగర్‌హౌజ్ హషీమ్‌నగర్‌కు చెందిన సయ్యద్ మజహిర్(Syed Mazahir Ali) అలీపై చికాగోలో(Chicago) దాడి చేశారు దుండగులు. హోటల్ నుంచి ఇంటికెళ్తున్న మజహిర్ అలీపై నలుగురు దుండగులు దాడికి దిగారు. ఈ దాడిలో మజహిర్ తల, ముక్కు, కళ్లపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఫిబ్రవరి 4వ తేదీన చికాగోలోని క్యాంప్‌బెల్ ఏవ్‌లో(Campbell Ave) జరిగింది.

Chicago
అమెరికాలో(America) భారతీయ విద్యార్థులపై(Indian students) దాడులు పెరుగుతున్నాయి. లేటెస్ట్‌గా హైదరాబాద్ లంగర్‌హౌజ్ హషీమ్‌నగర్‌కు చెందిన సయ్యద్ మజహిర్(Syed Mazahir Ali) అలీపై చికాగోలో(Chicago) దాడి చేశారు దుండగులు. హోటల్ నుంచి ఇంటికెళ్తున్న మజహిర్ అలీపై నలుగురు దుండగులు దాడికి దిగారు. ఈ దాడిలో మజహిర్ తల, ముక్కు, కళ్లపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఫిబ్రవరి 4వ తేదీన చికాగోలోని క్యాంప్‌బెల్ ఏవ్‌లో(Campbell Ave) జరిగింది. ఇండియానా వెస్లే యూనివర్శిటీలో(Indiana Wesley University) సయ్యద్ మజహిర్ అలీ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఆరు నెలల క్రితం హైదరాబాద్ నుంచి అమెరికాకు ఉన్నత చదువు కోసం వెళ్ళాడు. గత శనివారం క్యాంప్‌బెల్ ఏవ్‌లోని హోటల్ నుంచి ఫుడ్డు తీసుకుని ఇంటికి వెళుతున్నప్పుడు రోడ్డుపై నలుగురు దుండగులు దాడి చేశారు. తీవ్రంగా కొట్టి, గన్‌తో బెదిరించి అతడి ఫోన్ , వాలెట్‌ను ఎత్తుకెళ్లారు.చికాగోలోని కాంప్‌బెల్‌లో ఇంటి దగ్గర మజహిర్‌ను దుండగులు వెంబడించిన సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. . హైదరాబాద్‌లో నివసిస్తున్న అలీ భార్య అమెరికా వెళ్లేందుకు సహాయం కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను సంప్రదించారు.
