టీమిండియా(Team india) స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీకి(Virat kohli) చెందిన ఓ పబ్‌పై(Pub) కేసు నమోదయ్యింది.

టీమిండియా(Team india) స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీకి(Virat kohli) చెందిన ఓ పబ్‌పై(Pub) కేసు నమోదయ్యింది. బెంగళూరులోని(Bangalore) ఎం.జీ రోడ్డులో ఉన్న కోహ్లీకి చెందిన వన్‌ 8 కమ్యూన్‌ పబ్‌(one 8 Commune) నిర్ణీత సమయానికి మంచి తెరచి ఉండటతో పోలీసులు కేసు నమోదు చేశారు. అర్థరాత్రి పెద్ద పెట్టున శబ్దాలు రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పబ్‌ నుంచి పెద్ద శబ్దంతో సంగీతం వినిపిస్తున్నదని స్థానికులు చేసిన కంప్లయింట్‌ ఆధారంగా కబ్బన్‌ పార్క్ పోలీసులు నగరంలోని రెస్టారెంట్లు, బార్లు, పబ్బులపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎం.జి. రోడ్డులోని వన్‌ 8 కమ్యూన్‌, చర్చి స్ట్రీట్‌లోని ఎంపైర్‌ రెస్టారెంట్‌, బ్రిగేడ్‌ రోడ్డులోని పాంజియో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు అర్ధరాత్రి 1:30 గంటల వరకూ తెరిచి ఉంచడాన్ని గుర్తించారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకే వాటికి అనుమతి ఉన్నప్పటికీ, ఆ తర్వాత కూడా నిర్వాహకులు వాటిని తెరిచి ఉంచుతున్నారు. దీంతో ఆయా రెస్టారెంట్లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story