సెల్‌ఫోన్లు పేలుతూ(Phone blast) మనుషులు చనిపోవడాన్ని అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం.

సెల్‌ఫోన్లు పేలుతూ(Phone blast) మనుషులు చనిపోవడాన్ని అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. నిత్యం ఏదో ఒక చోట సెల్‌ఫోన్‌ పేలిపోతూ ప్రాణాలు పోవడమో, గాయాలు కావడమో జరిగిన ఘటనలు చూస్తున్నాం. తాజాగా తమిళనాడులోని(Tamil) రామనాథపురం(Ramnathapuram) జిల్లా పరమక్కుడిలో సెల్ ఫోన్ పేలిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు రజినీ స్వస్థలం పరమక్కుడి పక్కనే ఉన్న ఒట్టపాలెం. పరమకుడిలోని ఓ బ్యాంకులో వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో పరమకుడి నుంచి మదురైకి బైక్‌పై తిరిగి వస్తుండగా రజనీ ప్యాంట్ జేబులో ఉంచుకున్న సెల్‌ఫోన్ పేలింది. తన సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలి ద్విచక్ర వాహనంపై నుంచి కముదకుడి అనే ప్రదేశంలో కిందపడిపోవడంతో రజనీ షాక్‌కు గురయ్యారు. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరాడు. ప్రమాదంపై పరమక్కుడి టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story