తమిళనాడులోని సేలం జిల్లా డేనిష్‌పేట అటవీ ప్రాంతంలో గబ్బిలాలను వేటాడి, వాటి మాంసాన్ని చికెన్‌గా మార్చి హోటళ్లకు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు, కమల్, సెల్వంను పోలీసులు అరెస్టు చేశారు

తమిళనాడులోని సేలం జిల్లా డేనిష్‌పేట అటవీ ప్రాంతంలో గబ్బిలాలను వేటాడి, వాటి మాంసాన్ని చికెన్‌గా మార్చి హోటళ్లకు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు, కమల్, సెల్వంను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితులు తాము కొన్ని నెలలుగా గబ్బిలాలను వేటాడుతూ, వాటి మాంసాన్ని చిల్లీ చికెన్‌ వంటి వంటకాలుగా తయారు చేసి స్థానిక హోటళ్లకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. ఈ కేసులో పోలీసులు నిందితులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 కింద కేసు నమోదు చేశారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు, దీనిలో గబ్బిలాల వేటకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక హోటళ్లు మరియు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో మాంసం సరఫరా గురించి మరింత విచారణ జరుగుతోంది. సేలం, కమల్‌ ఇచ్చిన సమాచారంతో నగరంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్లపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. కాగా ఇప్పటి వరకు పిల్లి, కుక్క, ఎలుకల మాంసాన్ని ఇలా తరలించడం చూశాం. ఇప్పుడు ఏకంగా గబ్బిలాల మాంసాన్ని చేరవేస్తుండడం ఇప్పుడు కలవరపాటుకు గురవుతోంది

ehatv

ehatv

Next Story