✕
బెంగళూరుకు చెందిన ఓ మహిళ(38) జీవన సమస్యలతో కొట్టుమిట్టాడి కేరళ(Kerala)లోని ఓ ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లింది.

x
బెంగళూరుకు చెందిన ఓ మహిళ(38) జీవన సమస్యలతో కొట్టుమిట్టాడి కేరళ(Kerala)లోని ఓ ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లింది. అక్కడ పూజలు చేస్తే సమస్యలు తొలగిపోతాయని నమ్మించిన పూజారి అరుణ్ (Arun)పూజలు కఠినంగా ఉంటాయని మహిళను ఒప్పించాడు. మహిళ ఒంటిపై నూలు పోగు లేకుండా చేసి పూజలో పాల్గొనేలా చేశాడు.. విపరీత భయానికి గురైన మహిళ పూజలు అయిపోయాక ఇంటికి తిరిగి వెళ్లింది. ఇంటికి వెళ్లిన మహిళను పూజారి అరుణ్ మళ్లీ రావాలని బలవంతం చేశాడు.. మహిళ బట్టలు లేకుండా పూజలో పాల్గొన్న వీడియోలు, ఫోటోలు ఉన్నాయని బెదిరించాడు. దీంతో తిరిగి పూజకు వెళ్లిన మహిళపై లైంగిక దాడి చేసి, డబ్బులు తీసుకొని ఎప్పుడూ పిలిస్తే అప్పుడు రావాలని బెదిరించాడు. దీంతో మహిళ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పూజారి అరుణ్‌ని అరెస్ట్ చేసి, పూజారికి సహాయం చేస్తున్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు

ehatv
Next Story