ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Narendra Modi) పేరిట ప్రత్యేకంగా మామిడిపళ్లను కాయించాడో(Mangoes) రైతు! మోదీ పట్ల ఆయనకున్న అభిమానం అలాంటిది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Narendra Modi) పేరిట ప్రత్యేకంగా మామిడిపళ్లను కాయించాడో(Mangoes) రైతు! మోదీ పట్ల ఆయనకున్న అభిమానం అలాంటిది. అంతే అభిమానం బీహార్‌కు(Bihar) చెందిన ఓ వ్యాపారికి ఉంది. ఆ మిఠాయివాలా ఏం చేస్తున్నారంటే దీపావళి పండుక సందర్భంగా మోదీ లడ్డూను(Modi Laddu) తయారు చేస్తున్నారు. గంగాజలంతో(Ganga jal) ఈ లడ్డూలను తయారుచేస్తుండటం విశేషం. పైగా ఈ లడ్డూ తయారీకి స్వచ్చమైన కుంకుమపువ్వు, దేశీ నెయ్యి(Ghee), పిస్తా, బాదం పప్పుతో పాటు రోజ్‌ వాటర్‌, జ్యూస్‌ను వినియోగిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రత్యేకమైన లడ్డూను దేశప్రజలకు అందుబాటులోకి తెస్తానంటున్నారు మిఠాయి దుకాణం వ్యాపారి లాలూ శర్మ. తాను కూడా వారణాసికి చెందిన వాడినేనని, మోదీ కూడా వారణాసి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని లాలూ శర్మ అంటున్నారు. తమ ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకునే లడ్డూలో గంగాజలం వాడుతున్నానని చెప్పారు

Updated On
Eha Tv

Eha Tv

Next Story