✕
కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

x
కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు, ముఖ్యంగా కోళ్ల ఫారమ్ కార్మికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. వ్యాధి వ్యాప్తి చెందకుండా బాతులు, కోళ్లను చంపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సరిహద్దుల్లో నిఘా పెంచి, కేరళ నుంచి కోళ్ల తరలింపును తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

ehatv
Next Story

