కాంగ్రెస్(Congress) అధినేత రాహుల్ గాంధీ(Rahul gandhi) అమెరికా(america) పర్యటన ముగించుకుని ఈరోజు సాయంత్రం భారత్‌కు తిరిగి రానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వర్గాలు సమాచారం అందించాయి. ప్రధాని మోదీ(PM MODI) అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ(Rahul gandhi) అమెరికా పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి రావడం యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు.

BJP Amit Malviya
కాంగ్రెస్(Congress) అధినేత రాహుల్ గాంధీ(Rahul gandhi) అమెరికా(america) పర్యటన ముగించుకుని ఈరోజు సాయంత్రం భారత్‌కు తిరిగి రానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వర్గాలు సమాచారం అందించాయి. ప్రధాని మోదీ(PM MODI) అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ(Rahul gandhi) అమెరికా పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి రావడం యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు. అయితే బీజేపీ(BJP) రాహుల్ పర్యటనపై ప్రశ్నలు సంధిస్తోంది. రాహుల్‌ను ఉద్దేశించి బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్(Amith) మాల్వియా.. రాహుల్ గాంధీ విదేశాల్లో ఎందుకు ఎక్కువ సమయం గడుపుతారు? అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ విదేశాల్లో ఎందుకు ఎక్కువ సమయం గడుపుతున్నారు.. ప్రత్యేకించి ఆయన పర్యటన ఎక్కువ భాగం మిస్టరీగా మారిందని అమిత్ మాల్వియా(amith Malviya) ఒక ట్వీట్‌లో రాహుల్‌పై విరుచుకుపడ్డారు. 'భారత్‌ను వ్యతిరేకించే విదేశీ ఏజెన్సీలు, సమూహాలతో తన రహస్య సమావేశాల గురించిన అనేక నివేదికలు.. ఈ పర్యటన ప్రయోజనాల గురించి మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి' అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ మే 30న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకోవడం గమనార్హం. అక్కడ ఆయన ప్రతిష్టాత్మకమైన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులతో ముచ్చటించారు.
కాలిఫోర్నియాలోని ప్రముఖ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ(Standford university) క్యాంపస్‌లో రాహుల్ గాంధీ చేసిన ఉపన్యాసం తీవ్రచర్చకు దారితీసింది. రాహుల్ తన ప్రసంగంలో భారతదేశంలో ప్రతిపక్షాలు పోరాడుతున్నాయని అన్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ ఆధీనంలో ఉన్నాయి. దీనిపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్నామన్నారు. రాహుల్ గాంధీ విదేశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. మార్చి 6న కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కూడా రాహుల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు.
