రాజస్థాన్‌లో ఓ బీజేపీ నేత తన ప్రియురాలి కోసం భర్తను చంపి దొంగలు చంపినట్లు నాటకం ఆడాడు.

రాజస్థాన్‌లో ఓ బీజేపీ నేత తన ప్రియురాలి కోసం భర్తను చంపి దొంగలు చంపినట్లు నాటకం ఆడాడు. తన ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యనే కిరాతకంగా హత్య చేశారు. అయితే, ఆమెను దొంగలు హత్య చేసినట్టు నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి.పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన బీజేపీ నాయకుడు రోహిత్ సైనీ. ఆయనకు సంజుతో కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. అయితే, రోహిత్‌కు రీతు సైనీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరూ రెండేళ్లుగా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. రీతు సైనీ అప్పటికే వివాహం కాగా.. భర్తతో విడాకులు తీసుకుంది. ఆమెకు నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో తనకు అడ్డుగా ఉన్న సంజును ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని రీతు సైనీ ప్లాన్ చేసింది. ఆమెను హత్య చేయాలని భర్త రోహిత్, అతడి ప్రియురాలు పన్నాగం పన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు పదో తేదీన తమ ప్లాన్ ప్రకారం సంజును వారు హత్య చేశారు. అనంతరం, రోహిత్ సైనీ.. పోలీసులను, కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నంలో భాగంగా.. ఆరోజు రాత్రి తన ఇంట్లో దోపిడీ జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంట్లో చోరీకి వచ్చిన దొంగలే.. సంజును హత్య చేశారని నమ్మించే ప్రయత్నం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బంగారం, డబ్బులు దొంగతనం చేసి.. సంజును హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో రోహిత్, రీతు సంబంధం గురించి బయటకు వచ్చింది. ఈ క్రమంలో తమదైన తీరులో పోలీసులు.. రోహిత్‌ను ప్రశ్నించగా.. తన భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.రోహిత్, రీతును పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
