అమ్మాయిలకు కత్తులను కానుక

బీహార్‌లోని(Bihar) సీతామర్హి(Sitamarhi) నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే(MLA) మిథిలేష్‌ కుమార్‌(Mithilesh kumar) దసరా పండుగ(Dasara festival) రోజున అమ్మాయిలకు కత్తులను(Knife) కానుకగా(Gift) ఇచ్చారు. ఓ దుర్గామాతా మండపం దగ్గర ఆయుధాలు, తుపాకులు, కత్తులకు ఆయన ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా కాలేజీ అమ్మాయిలకు, స్కూల్‌ బాలికలకు కత్తులను పంచిపెట్టారు. ఎవరైనా దుర్మార్గులు అమ్మాయిలను తాకితే వారి చేతులను ఈ కత్తితో(Sword) నరకాలని మిథిలేష్‌ కుమార్‌ పిలుపు కూడా ఇచ్చారు. 'దుర్మార్గుల చేతులు నరికే సామర్థ్యాన్ని మన సోదరీమణులు కలిగి ఉండాలి. అవసరమైతే, నేను, మీరంతా దీనిని చేయాలి. మన సోదరీమణులపై చెడు ఉద్దేశం ఉన్న దుర్మార్గులందరినీ నాశనం చేయాలి’ అని చెప్పుకొచ్చారు. నవరాత్రులను పురస్కరించుకుని ఎమ్మెల్యే మిథిలేష్‌కుమార్‌ పలు దుర్గా మాతా పూజా మండపాలను సందర్శించారు. రామాయణం పుస్తకంతోపాటు కత్తులను పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే తీరును చాలా మంది విమర్శిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story