మన దేశంలో పాము కాటుతో(snake bite) ఏటా ఎంత మంది చనిపోతున్నారో తెలుసా?

మన దేశంలో పాము కాటుతో(snake bite) ఏటా ఎంత మంది చనిపోతున్నారో తెలుసా? సుమారు అర లక్ష మంది! ఆశ్చర్యపోకండి.. ఇది నిజం. ప్రపంచవ్యాప్తంగా పాముకాటు మరణాలలో అత్యధికం మన దేశంలోనే చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ(BJP) ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ(Rajiv Pratap Rudi) లోక్‌సభలో చెప్పారు. ప్రతి ఏడాది మన దేశంలో 30 లక్షల నుంచి 40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారని, సుమారు 50 వేల మంది చనిపోతున్నారని రాజీవ్‌ ప్రతాప్‌ చెప్పారు. ప్రపంచంలోనే ఇది అత్యధికం కావడమే ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దేశంలో పాము కాటు మరణాలను అరికట్టే దిశగా చర్యలు చేపట్టాలని రాజీవ్‌ ప్రతాప్‌ కోరారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story