ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు(Assembly By Elections) జరిగాయి.

ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు(Assembly By Elections) జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ(BJP) మరోసారి సత్తా చాటింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీదే గెలుపు. రెండు స్థానాల్లోనే సమాజ్‌వాదీపార్టీ సత్తాచాటింది. అయితే 60 శాతం ముస్లిం జనాభా ఉన్న కుండార్కి(Kundarki) అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి దాదాపు లక్ష ఓట్ల మెజార్టీ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ అభ్యర్థి రాంవీర్‌సింగ్‌కు(Ramveer singh) దాదాపు లక్షా 75 వేల ఓట్లు సాధించి.. లక్షా 50 వేల ఓట్ల అతిభారీ మెజార్టీ సాధించడం విశేషం. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇక్కడ బీజేపీకి విజయం దక్కింది. సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రిజ్వాన్ అలీకి కేవలం 25 వేల ఓట్ల లోపే రావడం గమనార్హం. ఈనియోజకవర్గంలో దాదాపు 11 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ పడ్డారు, 60 శాతం ముస్లింలు ఉన్నాకానీ బీజేపీ అభ్యర్థి రాంవీర్‌సింగ్‌కు ఇంత భారీ మెజార్టీ రావడం విశేషం.

Updated On
Eha Tv

Eha Tv

Next Story