ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సంగీత దర్శకుడు, సచిన్ సంఘ్వి పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సంగీత దర్శకుడు, సచిన్ సంఘ్వి పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. సచిన్-జిగర్ జంటలోని సంగీత దర్శకుడు, తమ్మా, స్త్రీ 2, భేదియా , జరా హట్కే, జరా బచ్కే వంటి చిత్రాలకు హిట్‌ పాటలతో పాపులర్‌ అయిన సంఘ్విని లైంగిక ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. తన 20 ఏళ్ల వయస్సులో, ఫిబ్రవరి 2024లో సచిన్ సంఘ్వితో పరిచయం ఏర్పడిందని, అతను ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌ పంపాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనమ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని, వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత ఆమెను తన స్టూడియోకు పిలిపించి, పెళ్లి ప్రపోజ్ చేశాడని, తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసులు తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story