పెళ్లయిన నెల రోజులకే ప్రియుడితో వెళ్లిపోయిన వధువు, బ్రతికిపోయానని సంబరపడుతున్న వరుడు.

పెళ్లయిన నెల రోజులకే ప్రియుడితో వెళ్లిపోయిన వధువు, బ్రతికిపోయానని సంబరపడుతున్న వరుడు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) బుదౌన్ ప్రాంతానికి చెందిన సునీల్ అనే యువకుడికి గత నెల 17వ తేదీన వివాహం జరగగా, 9 రోజుల తరువాత పుట్టింటికి నవ వధువు వెళ్లింది. పుట్టింటికి వెళ్లి అక్కడినుండే ప్రియుడితో యువతి పరారైంది. ఈ విషయం తెలుసుకొని ఆమెను ప్రియుడితో ఉండడానికి వరుడు అంగీకరించాడు. నైనిటాల్‌కు హనీమూన్ వెళ్లడానికి ప్లాన్ చేశానని, మరో 'రాజా రఘువంశీ'గా మారి నా జీవితం నాశనం కాకుండా బ్రతికి బయటపడినందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్న యువకుడు. ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో హనీమూన్‌ పేరుతో తీసుకెళ్లి ప్రియుడితో భర్తను చంపించిన ఘటనను గుర్తుచేసుకున్నాడు వరుడు.

Updated On
ehatv

ehatv

Next Story